దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సాత్పురా పర్వత శ్రేణి లింకు
పంక్తి 24:
== భౌగోళిక స్వరూపం ==
[[దస్త్రం:South India satellite.jpg|200px|thumb|2003, జనవరి 31న [[నాసా]] ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.]]
దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న [[ద్వీపకల్పం]]. ఎల్లలుగా తూర్పున [[బంగాళాఖాతం]], పశ్చిమాన [[అరేబియా సముద్రం]], ఉత్తరాన వింధ్య [[సాత్పురా పర్వత శ్రేణి|సాత్పురా పర్వతాలు]] ఉన్నాయి. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా, మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. [[నర్మద]] నది వింధ్య, సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పుర పర్వతాలు డెక్కను పీఠభాగానికి ఉత్తరం వైపు ఎల్లగా ఉంది. అలాగే [[పశ్చిమ కనుమలు]] (Western Ghats) మరొకవైపు ఎల్లలుగాను ఉన్నాయి. పశ్చిమకనుమలు, అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని [[కొంకన్]] అని నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని [[గోవా]] అని అంటారు.
పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి [[మలనాడ్]], [[కెనరా]] ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన [[నీలగిరి]] పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి [[తమిళ నాడు]],[[కేరళ]], [[కర్ణాటక]] సరిహద్దుగా ఉన్న [[పాలక్కాడ్]], [[వేనాడ్]] కొండలు, ఇంకా [[సత్య మంగళం]] అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. [[తిరుపతి]], [[అన్నామలై]] కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు