"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

416 bytes removed ,  1 సంవత్సరం క్రితం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
==సినీ జీవితం==
2002లో '''ఈశ్వర్''' సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ [[సినిమా]] ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా [[తెలుగు]]<nowiki/>లో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన '''రాఘవేంద్ర''' సినిమా పరాజయం పాలైంది. 2004లో [[త్రిష]] సరసన నటించిన ''[[వర్షం (సినిమా)|వర్షం]]'' సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ '''అడవి రాముడు''', '''[[చక్రం (సినిమా)|చక్రం]]''' సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో [[ఎస్. ఎస్. రాజమౌళి]] దర్శకత్వంలో ప్రభాస్ [[శ్రియా]] సరసన '''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక ప్రముఖ నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన '''[[పౌర్ణమి (సినిమా)|పౌర్ణమి]]''', '''[[యోగి (2007 సినిమా)|యోగి]]''' సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ [[ఇలియానా]] సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో '''[[మున్నా]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి '''[[బుజ్జిగాడు]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.
 
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో [[అనుష్క]], [[నమిత]]ల సరసన '''[[బిల్లా]]''' సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి [[కొండపల్లి దశరథ్|దశరథ్]] దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
 
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో [[అనుష్క]], [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి '''బాహుబలి''' సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై [[ప్రపంచము|ప్రపంచ]] వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో '''[[సాహో]]''' అను చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా [[శ్రద్ధా కపూర్]] నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదలకి సిద్ధంగా2019లో ఉందివిడుదలయింది.
 
==నటించిన చిత్రాలు==
4,955

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2940178" నుండి వెలికితీశారు