ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో [[అనుష్క]], [[నమిత]]ల సరసన '''[[బిల్లా]]''' సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత [[పూరీ జగన్నాథ్|పూరి జగన్నాధ్]] దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి [[కొండపల్లి దశరథ్|దశరథ్]] దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. [[కుటుంబము|కుటుంబ]] విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
 
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో [[అనుష్క]], [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి '''బాహుబలి''' సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై [[ప్రపంచము|ప్రపంచ]] వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో '''[[సాహో]]'' చిత్రం 2019లో విడుదలయింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు