అజలాపురం జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== ప్రదేశం ==
తెలంగాణ రాష్ట్రంలో [[నల్లగొండ జిల్లా]] కేంద్రానికి [[మర్రిగూడ]] మండలం లోని [[అజలాపురం (మర్రిగూడ మండలం)|అజలాపురం]] గ్రామం ఉంది. జిల్లా కేంద్రం నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది. అజలాపురం గ్రామం నుంచి రెండు కి.మీ. వెళితే [[రాచకొండ]] గుట్టలకు ఆనుకొని సహజ సిద్ధంగా అజలాపురం జలపాతం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కి.మీ.. [[హైదరాబాదు|హైదరాబాద్‌]] నుండి 50 కి.మీ. దూరంలో ఉంది. చుట్టూరా కొండలు, గుట్టలతో పాటు పచ్చనిచెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచిపెడతాడతాయి. ఇక్కడి చల్లటి, ప్రశాంతమైన వాతావరణంలో బండరాళ్లపై జారిపడుతున్న ఆ నీటి సవ్వడి పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రకృతి అందాలు కలిగిన ఈ ప్రాంతం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/article11120447.ece|title=Spring near temple a crowd-puller|last=Reporter|first=Staff|date=2014-09-05|work=The Hindu|access-date=2020-05-11|language=en-IN|issn=0971-751X}}</ref>
== పర్యాటకుల సందడసందడి ==
ఎడాదిలో ఆరుమాసాల పాటు వచ్చే ఈ జలపాతాన్ని చూసేందుకు అనునిత్యం పర్యాటకులు వస్తుంటారు. మర్రిగూడ పరిసర ప్రాంతాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి [[హైదరాబాదు|హైదరాబాద్]]‌, [[మహబూబ్ నగర్|మహబూబ్‌నగర్]]‌, [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి జిల్లాల]] నుండి కూడా నిత్యం వందలమంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు.బుగ్గలో జలపాతంతోపాటు విశాలమైన ఎత్తైన కొండలు నిత్యం పచ్చదనాన్ని పరుచుకుని ఉండడంతో చూపరులకు కనువిందు కలగచేస్తాయి. ఈ వాటర్‌పాల్స్‌ దగ్గరకు వెళ్లాలంటే సుమారు రెండు కి.మీ. వరకూ కాలినడకన ప్రయాణం చేయాల్సిందే<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/reethi/571675|title=అజలాపురం బుగ్గ అందాలు అదరహో {{!}} రీతి {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-05-11}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/అజలాపురం_జలపాతం" నుండి వెలికితీశారు