"పేరిస్" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:గ్రీకు పురాణం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==అపస్వరం అనే ఏపిల్ పండు కథ==
స్వర్గానికి అధినేత [[జూస్]] భార్యలలో ఒకరైన థేమిస్ (Themis) జూస్ కొడుకులలో ఒకడు జూస్ ని పదవీభ్రష్టుడిని చేస్తాడని జోశ్యం చెప్పింది. ఈ జోశ్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్లి, అక్కడ తేటిస్ (Thetis) అనే జలకన్యనిజలకన్య (nymph)ని చూసి, మనసు పడి, గాంధర్వ విధిని పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు తేటిస్ కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించిన వాడు అవుతాడు అని మరొకరు (ఒక కథనం ప్రకారం Prometheus) జోశ్యం చెప్పేరు. జూస్ రెండు రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారు పడి, తేటిస్ ని పీలియస్ (Peleus) అనే ముసలి మానవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు.(ఈ పీలియస్ కొడుకే అక్ఖిల్లిస్ అనే యోధుడు!) విందుకి జూస్ అందరినీ ఆహ్వానించేడు - కలహభోజని అని పేరు తెచ్చుకున్న ఒక్క ఏరీస్ (Eris) ని తప్ప!
 
తనకి ఈ విధంగా జరిగిన అవమానానికి ఏరీస్ కోపోద్రేకురాలు అయింది. అసహనంతో రగులుతున్న ఏరీస్ అతిధులు బారులు తీర్చి భోజనాలు చేస్తున్న మందిరానికి గాలివానలా దూసుకు వచ్చింది. ఆమె లోపలికి రాకుండా హెర్మీస్ (Hermes) అడ్డగించి అగ్గి మీద గుగ్గిలం జల్లేడు. ఏరీస్ బయట నుండే “ఇదే నా పెండ్లి కానుక” అంటూ ఒక బంగారు ఏపిల్ పండుని అతిథుల మధ్యకి విసిరింది. ఆ బంగారు ఏపిల్ పండు మీద “ఇది ముల్లోకాలలోను అందమైన ఆడదానికి మాత్రమే” అని రాసి ఉంది. ఇంకేముంది. “ఆ పండు నాదే!” అంటూ అక్కడ ఉన్న దేవతలంతా ఎగబడ్డారు. ఆ దొమ్మీలో హేరా, ఎతీనా, ఏఫ్రొడైటి అనే ముగ్గురు దేవతలు ఆ పండుని స్వాధీన పరచుకుందుకి పోటీ పడ్డారు. హేరా సాక్షాత్తు జూస్ భార్య. పైపెచ్చు పట్టమహిషి. ఈమె స్త్రీలకి, వివాహ జీవితాలకి అధినేత్రి. ఎతీనా విద్యలకి అధినేత్రి. ఏఫ్రొడైటి అందాలకి దేవత.
 
ఇలా పెళ్ళి అయిపోయి, కాపురం చేస్తున్న హెలెన్ పేరిస్ ని ప్రేమించేలా చేస్తుంది ఏఫ్రోడైటి. ఈ సంఘటన మహాభారత యుద్ధాన్ని పోలిన మహాసంగ్రామానికి దారి తీసింది. గ్రీకులకి, ట్రాయ్ నగరానికి మధ్య జరిగిన ఈ భీకర పోరాటాన్ని [[హోమర్]] అనే రచయిత తన [[ఇలియాడ్]], [[ఆడెస్సీ]] అనే ఉద్గ్రంథాలలో పొందుపరచేడు. ఈ కథలో కొన్ని పాత్రలు భువి నుండి దివికి, దివి నుండి భువికి సునాయాసంగా తిరుగుతూ ఉంటారు.
దేవతలు పోటీ పడి, పందెం కట్టి, దాని పర్యవసానంగా భూమి మీద లక్షలాది ప్రజలు నాశనం అవడానికి కారణభూతులు అవుతారు.
 
==మూలాలు==
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2940641" నుండి వెలికితీశారు