గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
గొరవయ్యలు నృత్యం చేస్తున్నప్పుడు పాటలు పాడరు. పాట పాడే సమయంలో డమరుకాన్ని ఒక పక్క మాత్రమే నాలుగు వేళ్ళతో వాయిస్తారు. డమరుకంతో పాటు పిల్లనగ్రోవిని లయాత్మకంగా వాయిస్తారు. డమరుకం నుండి పుట్టే ధ్వనులు డడ ముడ్డ డడ్ యిరడ డడబుడ్డ బుడబుడ్డ బుడ్ అని ఉంటాయి. వీరిని చూస్తే పిల్లలకు భయం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పిల్లలను భయపెట్టడానికి గొరవయ్యలకు పట్టిస్తానని చెప్పడం జరుగుతుంది.
నృత్యంలో సరిసంఖ్యలో పల్గొంటారు. ఇల్లిల్లూ తిరిగే సమయంలో మాత్రం ఒక్కరే నృత్యం చేస్తారు. డమరుకం, పిల్లన గ్రోవి వాయిస్తూ గుండ్రంగా తిరుగుతూ, ఒక్కొక్క కాలితో నేలపై కొట్టడం, తల తిప్పడం, పిల్లల్ని భయపెట్టడానికి ఉన్నట్టుండి డమరుక శబ్ధాన్ని బుడ బుడ్ బుడబుడ్ బుడడ్ అని వినిపించడం నడుమును వయ్యారంగా ఆడించడం వీరి నృత్యంలోని ప్రత్యేకతలు.
 
 
సామూహికంగా నృత్యం చేస్తున్నప్పుడు సరిసంఖ్యలో వరుసలుగా నిలబడి ఒకసారి డమరుకాన్ని వాయించి గుండ్రంగా తిరుగుతూ తిరిగి వరుసలో నిలబడతారు. వరుసలోని ఎదురుబదురుగా పోటీగా అడుగులు వేస్తూ కూర్చొని లేవడం, కూర్చొని తిరగడం ఒకవరుసలోని వారు మరో వరుసలోనికి మారడం చేస్తారు. ఇదంతా డమరుకం, పిల్లంగ్రోవి వాయిస్తూనే చెస్తుంటారు. తరువాత పాటలు పాడుతూ గజ్జెల్ని నేలపై తాడిస్తూ నాలుగు వేళ్ళ సహాయంతో డమరుకం వాయిస్తారు. ఒకరు పాడుతుంటే మిగిలిన వారు వంత పాడతారు.
 
===పాటలు- సాహిత్యం:===
శివుడు నీవయ్య శ్రీశైల మల్లయ్య
 
కావగ రావయ్య శివయ్య
 
సిక్కు జడలవాడు శివ నీలకంటుడు
 
పైనిండ యీబూది మహా శివుని
 
మెడలోన రుద్రచ్చలు దేవాది దేవా
 
సన్న కమ్మడి తెచ్చి సరి మడత వేయించి
 
గుండు మల్లెలు పోసి దేవాది దేవా
 
గుండు మల్లెలపైన శివుని కొప్పిరి పెట్టి
 
పాలు బెల్లం పోసెనే మహాశివుని
 
మనసార తను కొలిసెను దేవాది దేవా
 
వారమారమునాదు సోమవారము నాడు
 
నానందమయ్యెడు శివుడు నానందమయ్యెడు
 
 
మల్లేసుని వేట వర్ణనను సంభంధించిన పాటలో వేటలో లాగే పరుగులెత్తడం, పాటలోను వాద్యం వాయించే సమయాల్లో బిరబిరా పడటం, వాయించడం ఉంటుంది.
 
 
యాట యెల్లిన చూడరే మల్లేసుడు
 
యాట యెల్లెను చూడరే మల్లేసుడు
 
సామి యాట యెల్లిన చూడు కాడు కాపురమందు
 
సాటిలేని గట్ట సామి మల్లేసుడు
 
సామి మెరుపు చందన కార మెరుపు చందనకార
 
మెడనిండా తెల్పూలు ముందు గంగనపాలు
 
ముడిసి పుట్టన బోసి క్రున్నులు దాగిన గురనీల జంగాము
 
కన్నె జింకను బట్టి కొంత యీబూదిని బెట్టీ
 
తనలోన బల్కిన శివ నీల కంటుడు
 
శివ రాత్రికి మల్లయ్య కొండకు పోతూ గొరవయ్యలు పాడే పాట ఇలా ఉంటుంది. ఈ పాటలో మల్లయ్య కొండను, అందులోని దేవాలయాన్ని, దేవుని ఘనతను, కోనేరు లోతు పాతులను, తెలుపుతూ పాటను పాడతారు. ఇందులోని పల్లవి ఎత్తుకోనే సమయంలో చివరి రెండు పాదాలు పల్లవిలాగా ఆలపించడంతో ఒక తూగు వస్తుంది.( చిగి చెర్ల కృష్ణారెడ్డి)ఈ పాటలో డమరుకాన్ని తక తక తక గతిలో కొడుతుంటారు.
 
శివ రాత్రికి మల్లయ్య కొండకు పోతూ గొరవయ్యలు పాడే పాట ఇలా ఉంటుంది. ఈ పాటలో మల్లయ్య కొండను, అందులోని దేవాలయాన్ని, దేవుని ఘనతను, కోనేరు లోతు పాతులను, తెలుపుతూ పాటను పాడతారు. ఇందులోని పల్లవి ఎత్తుకోనే సమయంలో చివరి రెండు పాదాలు పల్లవిలాగా ఆలపించడంతో ఒక తూగు వస్తుంది.( చిగి చెర్ల కృష్ణారెడ్డి)ఈ పాటలో డమరుకాన్ని తక తక తక గతిలో కొడుతుంటారు.
 
 
శివకొండకని పోదాము రారమ్మ
 
మల్లయ్య కొండ సామినే చూతాము
 
శివాపురమికి పరమటంట
 
శిద్దులేలే మల్లయ్య కోండ
 
సిన్నగనే పోదాము రారమ్మ
 
ఆ పరవతాలకు మెల్లగనే పోదాము
 
 
*మల్లయ్యను నిద్ర లేపడానికి పాడే పాట:
 
కురువతై మైలారులింగ జడజడాలింగాలు
 
పాములే వరనంబు పార్వతీ మల్లయ్య
 
మల్లయ్యను లేపరమ్మ
 
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
 
సద్దురుని లేపరమ్మ
 
పరమట దేశాన పాలు కవల్లోచ్చే
 
పంచనే దిగినాయి మల్లయ్యను లేపురమ్మ
 
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
 
సద్దురుని లేపురమ్మ
 
చివరగా బండారు ఇచ్చే పటనే మంగళం పాటగా పడతారు. శుభ కార్యాలకు, ఇంటికి అరిష్టం కలుగకుండా ఉండడానికి ఇంటికి పిలిపించి పాడించుకుంటారు. గొరవయ్యలు ఇంటిలోని శివుని కొలిచి ఇంటి యజమానితో పూజింపచేసి యీనాములు పుచ్చుకుంటారు. తరువాత తిత్తిలోని బండారును ఇస్తూ పాడతారు.
 
 
శివ బండారు బండారు తలలో మల్లయ్య
 
యీబూది బండారు తలలో
 
శ్రీశైల మల్లయ్య యీబూది
 
శివమనందియీశుని యీబూది బండారు
గట్టు మల్లయ్య సామి బండారు
 
మాగంగు మాళమ్మ దేవి బండారు బండారు
 
మైలారు లింగయ్య బండారు
 
మాగంటి ఈశుని బండారు బండారు
 
తిరపతీ తిమ్మమ్మ బండారు
 
శివ సామి గోవింద రాజుని బండారు బండారు
 
నువ్వెక్కలాడేనే బండారు
 
వైబోగమాడెనే బండారు. బండారు
 
 
===సామాజిక జీవనం:===
జమ్మలమడుగు ప్రాంతంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గొరవయ్యలు నృత్య ప్రదర్శనలిస్తారు. ఈ పరిశోధకుడు వారిని కలిసినప్పుడు చెప్పిన విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. వీరు మదనపల్లే తాలూకా తంబళ్ళ పల్లెకు చెందిన వారు. ఊరూరా తిరుగుతూ వీరు నృత్య ప్రదర్శనలిస్తుంటారు. వీరిలో గణ నాయకుడు సిద్దయ్య తాను స్వయంగా శివుని మీద రచించిన దండకం చదివి వినిపించాడు. వీరంతా సివరాత్రి నాటికి గట్టు మల్లయ్య కొండ చేరతారు. పొలాలు ఉన్నా, తమ కుల వృత్తిని మాత్రం మరచిపోమని వీరు చెబుతారు. ప్రభుత్వం ఈ కళాకారులను ఆదుకోవలసిన అవసరం ఉందని వీరిలో చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని వీరు వాపోయారు.
చిత్తూరు జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల కింద 40 మంది గొరవయ్యలుంటే నేడు 9 మంది గొరవయ్యలు మాత్రమే ఉన్నారని వీరు కూడా భిక్షాటన చేస్తున్నారని, ప్రభుత్వం ఎటువంటి ఆధారం చూపలేదని వివరించారు. కురుబ కులస్థులైన వీరు గొరవయ్య కుల వృత్తితోబాటు వ్యవసాయం, జీవుల్ని కాయడం వంటివి చేసి బతుకుతున్నారు. ఫిబ్రవరి గురువారం 17వ తేదీ 2005 ఆంధ్రజ్యోతి దినపత్రికలో భిక్షాటనే మల్లయ్య దార్ల బతుకులు అన్న శీర్షిక కింద వ్యాసం ప్రచురితమైంది.చిత్తూరు జిల్లాలోని మల్లయ్య కొండ దేవాలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని, ఈ మాన్యంలో గొరవయ్యలకు చెందాల్సిన భుములు కూడా ఉన్నాయని అందులో పేర్కొనడం జరిగింది. మాన్యపు భుములు ఉన్నాప్పటికీ అవి వీరికి చెందక వీరు భిక్షాటనకు దిగడం ప్రస్తుత సమాజం కళారూపాలకు ఇస్తున్న విలువలను మనం గ్రహించవచ్చు.
ఆధారాలు:
జానపద నృత్యకళ- డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి
అనంతపురం, అప్పరాచ్చెర్వు లోని ముసుగు రామన్న బృనదం
అనంతపురం: కె. రామంజనేయ బృనదం, కురుబనాగన్న బృందం
చిత్తూరు జిల్ల, తంబళ్ళపళ్ళె, బన్యాల సారదయ్య బృనదం
 
==ఆధారాలు:==
Note:
*జానపద నృత్యకళ- డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి
*అనంతపురం, అప్పరాచ్చెర్వు లోని ముసుగు రామన్న బృనదంబృందం.
*అనంతపురం: కె. రామంజనేయ బృనదం, కురుబనాగన్న బృందం
*చిత్తూరు జిల్ల, తంబళ్ళపళ్ళె, బన్యాల సారదయ్య బృనదంబృందం
 
==బయటి లింకులు==
 
గొరవయ్యల నృత్యం *[www.maganti.org/andhrakalalu/videos/goravayyalu.html గురవయ్యల నృత్యం లోఇక్కడ చూడవచ్చు].
 
 
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు