వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 627:
=== ఈ విషయంలో నాకు అభిప్రాయమేమీ లేదు ===
# అసలు ఏకపక్ష నిర్ణయాలే ఈ స్వేచ్ఛా విజ్ఞాన యజ్ఞం లో జరగకుండా ఉండాలనేది నా అభిమతం , ఉన్న క్రియాశీల వాడుకరులే తక్కువగా చర్చలలో పాల్గొంటున్నప్పడు ఈ విషయంలో నాకు అభిప్రాయమేమీ లేదు, ఉన్న [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|ఆ ఐదు మూల స్థంబాలను]] పట్టుకు వేళ్లాడటం తప్ప ! [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 12:01, 22 మే 2020 (UTC)
 
 
==ఇటీవలి పరిణామాలు - నిర్వాహకుల పొరపాట్లు==
తెవికీలో ఇటీవలి చర్చలను పరిశీలిస్తే నిర్వాహకులు పలు పొరపాట్లు చేస్తున్నారని గమనించవచ్చు. పలు కారణాల వల్ల నేను తెవికీలో చురుకుగా ఉండటం లేదు. సమయం లభించింది కదాని ఒక చూపుచూశాను. నేను ఎప్పుడో ఒకప్పుడు చూసిననూ వ్యాసాలను కాకుండా సభ్యుల చర్చలను, నిర్వాహకుల చర్యలను మాత్రం బాగా గమనిస్తాను. నేను గమనించిన వాటి ప్రకారం ఇటీవలి కాలంలో నిర్వాహకుల తప్పిదాలు, పొరపాట్లు కొన్ని క్రింద వివరిస్తున్నాను.
 
1) "...గత చర్చలో రెడ్డి గారికి అత్యంత పటిష్ఠమైన సమర్ధకుడుగా నిలిచిన వాడుకరి..." అంటూ @[[వాడుకరి:Chaduvari|సభ్యుడు:చదువరి]] నన్ను ఉద్దేశించి రాశారు. నన్ను సభ్యుడు:రెడ్డికి సమర్థకుడిగా ఎలా ఆపాదించారు? అంత ఖచ్చితంగా ఎలా నిర్థారించారు? ఏ తెవికీ ప్రధాన వాడుకరిలా కాకుండా నేను అందరికీ దూరంగా ఉంటూ, నిష్పక్షపాతంగా ఉండడానికై కనీసం నా సెల్‌ఫోన్ నెంబరు కూడా ఎవరికీ ఇవ్వలేను. ఎవరితోనూ సంప్రదింపులు లేవు, సంబంధాలు లేవు. ఇప్పటివరకు ఏ సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కాలేను. తెవికీలో నాకు మిత్రులు, శత్రువులంటూ ఎవరూ లేవు. ఆన్‌లైన్ వికీపీడియాలో సేవలకై ఆన్‌లైన్‌లో మాత్రమే నా సేవలందించాను. గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం అప్పుడప్పుడు తెవికీని సందర్శిస్తూ పొరపాట్లను (అది ఎవరిదైనా సరే) నిష్పక్షపాతంగా బయటపెడుతున్నాను. నిష్పక్షపాతంగా నా భావాలను ప్రకటించడానికి ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేను. నేను వాడుకరిని కాకుండా వాడుకరి చర్చలపై మాత్రమే దృష్టిపెడతాను. ఒకే వాడుకరికి ఒక సమయంలో పొరపాట్లు బయటపెట్టిననూ మరో సమయంలో ఆయన చర్యలను సమర్థంచిన సంఘటనలూ ఉన్నాయి. నేను చురుకుగా పనిచేసిన కాలంలో మీరు చురుకుగా లేరు కాబట్టి నా గురించి మీకంతగా తెలియదేమో! ఏడేళ్ళ క్రిందట అప్పటి నిర్వాహకులు పొరపాట్లపై పొరపాటు చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా చర్చలతో సంబంధం ఉన్న నిర్వాహకులే సదరు సభ్యుడిపై, అతను రాసిన వ్యాసాలపై చర్యలకు ఉపక్రమించి ఎలాంటి హెచ్చరిక లేకుండా నిషేధం విధించడం, నిష్కారణంగా చర్చాపేజీలను కూడా తొలగించడం లాంటి తీవ్రతప్పిదాలు చేస్తుంటే సభ్యుడు దీనస్థితిలో ఉన్న దశలో నేను రంగప్రవేశం చేసి నిర్వాహకుల తప్పులను ఎత్తిచూపానే తప్ప సభ్యుడికి, సభ్యుడి వ్యాసాలకు, సభ్యుడి చర్యలకు ఏ దశలోనూ సమర్థంచలేననే సంగతి చర్చల ద్వారా గమనించవచ్చు. ఆ సభ్యుడు చేసింది సరైనదేనని ఎప్పుడూ చెప్పలేను. ఇదే విషయాన్ని నేను అదే చర్చలో స్పష్టంగా పేర్కొన్నాను కూడా. పొరపాట్లు చేసిన నిర్వాహకులైనా, సభ్యులైనా వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వడానికి మాత్రం నాకు మనసొప్పదు. ఈ సంగతి కూడా నేను ఏనాడో పలికాను. సమర్థకుడనే మాటను మాత్రం నేనొప్పుకోను, దీనికై మీ వివరణ కోరుచున్నాను. (ఇప్పుడు కూడా క్రమపద్దతి లో చర్యలు తీసుకోని నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాను, మళ్ళీ సమర్థన అంటారేమో!!)
 
2) ఇప్పుడు సభ్యుడు:వైవీఎస్‌రెడ్డి పై వారం రోజుల నిషేధం విధించడం కూడా నిబంధలకు విరుద్దమే. నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులపై చర్యలకు నేను వ్యతిరేకిని కాను, కాని తీసుకొనే చర్యలు మాత్రం నిబంధనల ప్రకారం క్రమపద్దతిలో ఉండాలి కాని ప్రస్తుత చర్యలు ఆ దిశలో సాగలేవు. నిషేధం విధించే ముందు హెచ్చరిక జారీచేయడం కనీస భాధ్యత. ఎప్పుడో ఒకప్పుడు ఒక రోజు నిషేధం ఎదుర్కొన్నాడనీ, దాన్ని అవకాశంగా తీసుకొని ప్రస్తుతం హెచ్చరిక లేకుండా ఒకేసారిగా వారంరోజుల నిషేధం విధించడం తగునా? అప్పటి చర్చలకు ఇది కొనసాగింపు కాదు అంటూనే అప్పటి నిషేధాన్ని కొనసాగింపుగా ఇప్పుడు వారంరోజుల నిషేధాన్ని విధించడం ఏ మాత్రం సరైనది కాదని నేను గట్టిగా చెప్పగలను. కనీసం అప్పుడు విధించిన నిషేధమైనా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ కాదు. అది నిర్వాహకుల తప్పిదమేనని నేను ఆనాడే చెప్పాను. ఏదో కారణాల వల్ల నిబంధనలకు విరుద్ధంగా ఏడేళ్ళ క్రితం విధించిన ఒకరోజు నిషేధాన్ని సాకుగా తీసుకొని, గత చర్చలకు ఈ చర్చలు కొనసాగింపు కాదు అంటూనే గతంలో నిషేధం ఎదుర్కొన్నాడనీ ఇప్పుడు హెచ్చరిక లేకుండా నిషేధం విధించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలా చేయడం నిర్వాహక తప్పిదం గానూ, నిబంధనలు అతిక్రమించినట్లుగానూ పరిగణిస్తున్నాను.
 
3) సాక్‌పప్పేట్‌ల గురించి చెబుతూ సభ్యుడు:రవిచంద్ర కేవలం అనుమానంతో ఏకంగా [[వాడుకరి:JVRKPRASAD]] పేరు బయటపెట్టేశారు. ఇది చాలా పెద్ద తప్పిదం. విచారణ లేకుండా, ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఒకరి పేరును బయటపెట్టడం వివాదాలకు దారితీస్తుంది మరియు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తెవికీకి కూడా ఇలాంటి చర్యలు నష్టం కలిగించవచ్చు. సుమారు 12 సం.ల క్రితం నాటి అనుభవం చెబుతాను. అప్పుడు [[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సాయి|సభ్యుడు:సాయి నిర్వాహక ఎన్నిక]] వివాదంలో సాక్‌పప్పెట్‌గా అనుమానంతో అప్పుడు చురుకుగా ఉన్న నిర్వాహకుడు దేవా సభ్యుడు:రంగారావు పేరును వ్రాసి మళ్ళీ దిద్దుబాటును రద్దుచేశారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది ([[వాడుకరి చర్చ:Dev/క్రితం చర్చ 6#suspecting you as sockpuppet|చూడండి]]). చివరికి స్టీవార్డులను సంప్రదిస్తే ఒక సాక్‌పప్పెట్‌గా నిర్వాహకుడైన సభ్యుడు:రవిచంద్ర పేరు బయటపడింది. ([https://meta.wikimedia.org/wiki/Steward_requests/Checkuser/2008#2_users_in_tewiki చూడండి]). ఈ వివాదం వల్ల చురుకైన నిర్వాహకుడు దేవా మరియు సభ్యుడు:రంగారావు ఇద్దరూ తెవికీకి దూరమైనారు. ఇప్పడు సాక్‌పప్పెట్ గురించి చెప్పాలంటే ఆ సభ్యుడెవరో పసిగట్టడం పెద్ద పనేమీ కాదు. కాని ఆధారాలు లేకుండా పేరు బయటపెట్టడం మాత్రం సరికాదు. గత దశాబ్దం నుంచి వివిధ మార్పుపేర్లతో (కొన్ని సార్లు ఐపి అడ్రస్‌తో) రాస్తున్న ఆ సభ్యుడు చాలా సార్లు తెవికీలో జరుగుతున్న పొరపాట్లను బయటపెడ్డడం చూస్తున్నాం. నేను రాసిన [[వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 39#సరదా సరదాగా]]లో కూడా ఆ సభ్యుడి రెండు వాక్యాలున్నాయి (సభ్యుడిగా మరియు ఐపీ అడ్రస్‌తో). అసలు సభ్యనామంతో చెబితే సంబంధాలు చెడిపోతాయనే ఉద్దేశ్యంతోనే మారుపేరుతో రావడానికి కారణమేమో! ఇదే అభిప్రాయం గతంలో చర్చలలో నమోదైనట్లు గుర్తుంది. మన "మారుకరి" సీనియర్ సభ్యుడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొనియుంటే స్టీవార్డులకు కూడా చిక్కకపోవచ్చు.
 
4) మరో సభ్యుడు "నిర్వాహకులు లెక్కకు 10 మందికి పైగా ఉన్నారు.అందరికి భాధ్యత ఉంది.కొంత మంది స్తబ్థతగా ఉంటున్నారు.దాని వలన వికీపీడియాకు ఏమి ప్రయోజనమో ఆలోచించాలి" అంటూ రాశారు. ఇది ఎవరెవరిని ఉద్దేశించి చెప్పబడిందో కాని నిర్వాహకులంటే తమ వ్యక్తిగత పనులు మానుకొని తప్పనిసరిగా తెవికీలో పనిచేయాలని ఏమీలేదు. ఎవరి వ్యక్తిగత ఇబ్బందులు వారికుంటాయి. తెవికీలో పని చేసేవారు చేస్తారు, చూసేవారు చూస్తారు, చదివేవారు చదువుతారు, అంతే. తెవికీలో నిర్వాహకుల హోదా ఉన్నవారిని మిగితా నిర్వాహకులెవరూ పెంచిపోషించడం లేదుకదా! ఇది స్వచ్ఛందంగా చేసే ప్రవృత్తి మాత్రమే. ఇప్పుడు చురుకుగా లేని నిర్వాహకులలో అధికమంది ఒకానొక సమయంలో తెవికీని అభివృద్ధి పర్చడానికి భుజాలనెత్తుకున్నవారే. అప్పుడు నిర్వాహకులు తెవికీని ప్రగతిపథంలో పయనింపజేసి ఈ స్థితికి తెచ్చారనే విషయం కూడా మరవొద్దు. చాలా కాలం నుంచి చురుకుగా లేనట్లయితే ఎలాగూ నిర్వాహక హోదా నుంచి తొలగించబడతారు. అసలు చురుకుగా ఉంటూ కూడా నిర్వాహక పనులు చేయని నిర్వాహకులెవరో వారిపై దృష్టిసారించాలి. నిర్వాహకులు అంటే ఎల్లకాలం తెవికీలోనే కృషిచేయాలనీ, ఇదివరకు చేసింది గ్రహించక ఇప్పుడు మేము చేస్తున్నాము కాబట్టి అందరూ చేయాలనే అభిప్రాయంతో ఉండటం ఏ మాత్రం సరైనదికాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న ఒక నిర్వాహకుడు మధ్యలో చాలా కాలం పాటు స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్తబ్దుగా ఉన్నవారు తర్వాతి దశలో చురుకుగా మారవచ్చేమో! లేకుంటే హోదానే కోల్పోతారు, అంతేకాని ఇతరులపై చెప్పడం సరికాదు.
 
5) ఒక సభ్యుడు చిన్న వ్యాసాలను సిగ్గుపడే వ్యాసాలుగా పేర్కొనడం కూడా జరిగింది. కాని వాస్తవంగా పాఠకులు సిగ్గుపడేది నాణ్యమైన చిన్నవ్యాసాలు కాదు, పెద్దవ్యాసాలలో తాజాకరణలేని అంశాలు, పొరపాట్లు తెవికీలో బోలెడన్ని ఉన్నాయి ("మారుకరి"-మారుపేరుతో వ్రాసే వాడుకరి కూడా ఇటీవల ఇదే విషయాన్ని బయటపెట్టారు). ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తాజాకరణ అత్యావశక్యం. పెద్దవ్యాసాలు వ్రాసి (కాదుకాదు మక్కికిమక్కిఅనువదించి) పడేస్తున్నారు కాని తాజాకరణకు ఎవరూ పూనుకోవడం లేదు. ఉదా:కు పదేళ్ళ క్రితం మరణించిన వ్యక్తిని కూడా ఇంకనూ దేశాధినేతగానే కీర్తిస్తున్నాం. సిగ్గుపడాల్సింది ఇలాంటి విషయాలలోనే.
 
6) ప్రతీదానికి ఆంగ్లవికీని ప్రామాణికంగా తీసుకొనే మెజారిటీ నిర్వాహకులు ఈ విషయంలో మాత్రం చిన్న వ్యాసాలపై కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సరైన కారణాలు లేవు. తెవికీ అనేది ఏ కొందరి నిర్వాహకుల సొత్తు కాదు. ఇక్కడ రచనలు చేయడానికి అందరికీ హక్కు ఉంది (ప్రామాణిక నిబంధనలకు లోబడి). కేవలం పెద్దవ్యాసాలే ఉండాలనడం ఏ మాత్రం సరైనది కాదు (నాణ్యత కల్గిన చిన్న వ్యాసాలకు కొన్ని మినహాయింపులు ఉండాల్సిందే). కేవలం వ్యాసపరిమాణం ఆధారంగా వ్యాసాలు తొలగించడం వికీపీడియా మూలనిబంధనలకు వ్యతిరేకమని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. అదే కారణంతో సభ్యులపై చర్యలు తీసుకోవడం సమస్య తీవ్రతను పెంచుతుంది. దిద్దుబాట్లు చేసే హక్కు, తమ రచనలు వికీలో చూసుకొనే హక్కు విషయంలో ఎవరినీ కాదనలేము. కొన్ని అంశాలపై పెద్ద వ్యాసం వ్రాయడం కూడా కుదరకపోవచ్చు. పెద్దపెద్ద విజ్ఞాన సర్వస్వాలలో కూడా చిన్నచిన్న వ్యాసాలు మస్తుగా ఉన్నాయి. ఈ విషయంలో తెవికీలో దశాబ్దాల నుంచి ఎడతెగని చర్చలు సాగుతూనే ఉన్నాయి. చిన్న వ్యాసాలపై చర్చలు ఇంకనూ ఒక కొలిక్కి రాలేవు. అలాంటప్పుడు సభ్యులపై, వారి రచించే వ్యాసాలపై చర్యలు తీసుకోవడంలో తొందరెందుకు అన్నదే నా ప్రశ్న. ఈ విషయంలో ఇంకనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇకముందు దీనిపై పాలసీలు ఖచ్చితంగా మారవచ్చు. అలాంటప్పుడు కేవలం పరిమాణం ఆధారంగా వ్యాసాలను తొలగించడం సరైనది కాదు. కేవలం ఒకట్రెండు వాక్యాలున్న అతిచిన్న వ్యాసాలను తొలగించవచ్చేమో కాని సమాచారం లభించని నాణ్యమైన చిన్న వ్యాసాల విషయంలో తొలగింపులు ఏ మాత్రం సరైనది కాదని నేను గతంలో కూడా చెప్పాను. రేపు పాలసీలు మారి నాణ్యమైన చిన్న వ్యాసాలకు మినహాయింపు ఇచ్చినప్పుడు ఇప్పుడు తొలగించిన నాణ్యమైన చిన్న వ్యాసాల సంగతి ఏమిటి? ఈ సభ్యుల దిద్దుబాట్ల హక్కును హరించినట్లుగా ఎందుకు భావించరాదు? చర్చలు కూడా ఒక కొలిక్కి రానప్పుడు, మూలనిబంధనలకు వ్యతిరేకమైన పాలసీలు ఉన్నప్పుడు దాని ప్రకారం తీవ్రచర్యలు తీసుకోవడం సరైనదేనా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 06:20, 24 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు