వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 647:
: {{Ping|C.Chandra Kanth Rao}} గారూ, "నాణ్యమైన చిన్న వ్యాసాలకు" అంటే ఏమిటన్నది తెలియట్లేదండీ. మీ ఉద్దేశంలో అలాంటి నాణ్యమైన చిన్న వ్యాసం ఏదైనా వై.వి.ఎస్.రెడ్డి గారు ప్రారంభించినవాటిలో తొలగింపుకు గురై ఉంటే ఉదాహరణ ఇస్తారా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:32, 24 మే 2020 (UTC)
:: సాక్ పప్పెట్ విషయంలో నేను చేసిన ప్రతిపాదన విషయంలో నా మనసులో ఉన్న అనుమానం ఉన్నదున్నట్టుగా బయట పెట్టాను. దానికి కారణాలు కూడా వివరించాను. దానికి సంబంధించిన పర్యవసానాలకు బాధ్యుణ్ణి నేను. ఇదేదో పెద్ద తప్పు అని నేను భావించడం లేదు. -- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 07:47, 24 మే 2020 (UTC)
:::@[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] నేను వ్రాసిన పై విషయాలన్నీ వాడుకరి:రెడ్డికి సంబంధం లేవండి. నేనేమీ ఆయనకు సమర్థకుడిని కాదు అని స్పష్టంగానే చెప్పాను కదా! ఇటీవలి పరిణామాల లోటుపాట్లపై, దాని ఆధారంగా మాత్రమే చర్చ తీశాను. నాణ్యమైన చిన్న వ్యాసాల గురించి నేను ఇదివరకే చాలా సార్లు సందర్భానుసారం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే నా చర్చాపేజీలోనే [[జాన్ రిచర్డ్ హిక్స్]] వ్యాసం తొలగింపు ప్రతిపాదన వచ్చింది. తొలగింపుకు రెండే కారణాలు. ఒకటి మొలక అనీ, రెండోది మూలాలు లేవనీ. మొలకపై స్పష్టమైన నిర్వచనం లేనప్పుడు ఇది మొలక అని ఏ విధంగా నిర్థారిస్తారు. ఉన్న 5 వాక్యాలు మంచి సమాచారం ఇచ్చేవిగా లేవా? ఇందులో తప్పుడు సమాచారం గాని, పొరపాట్లుగాని ఉన్నాయా? కనీసం ఈ 5 వాక్యాల సమాచారమైనా పాఠకులకు ఎందుకు అందుబాటులో ఉంచరాదు. ఈ వ్యాసం వల్ల తెవికీకీ ఏమైనా నష్టమా? ఇప్పుడు ఈ వ్యాసం తొలగిస్తే తెవికీకి కలిగే ప్రయోజనమేమిటి? ఇలాంటి వ్యాసాల తొలగింపు వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనీ గతంలో చెప్పాను కూడా. నాణ్యమైన చిన్న వ్యాసాలంటే ఇవేనండి. ఇక మూలాల గురించి చెప్పాలంటే వ్యాసంలో ఏ వాక్యం కూడా అభ్యంతరంగా లేదు. వికీపీడియా ఐదు మూలస్తంభాలలో రెండోది ఏమి చెబుతుంది? " ... అవసరమైన చోట ... మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ..." అని మాత్రమేగా! వ్యాసంలో మూలాలు ఉండుట మంచిదే కాని అవి లేనంత మాత్రాన ఆ కారణంతో నాన్యమైన చిన్న వ్యాసం తొలగింపుకు గురయ్యే పరిస్థితి మాత్రం ఉండరాదు. వాక్యాలపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆధారం కోరబడింది మూస ఉంచవచ్చు. వాక్యాలు తొలగించవచ్చు. కొత్త సభ్యులకు మూలాల గురించి సాధారణంగా తెలియదు. మరి అలాంటప్పుడు వారు రచించే వ్యాసాలన్నీ తొలగించాలా? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 08:34, 24 మే 2020 (UTC)
::::@[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] మీరు రాసిన దానికి మీరు బాధ్యులే కావచ్చు. కాని ఇది నలుగురు కలిసి పనిచేసే వ్యవస్థ. ఇలాంటి చర్యలవల్ల తెవికీకి నష్టం జరుగుతుందనీ, గత్ అనుభవాన్ని ఆధారాలతో వివరించాను. అప్పుడు తొందరపడి కేవలం అనుమానంతో ఒక నిర్వాహకుడు ఒక సభ్యుడి పేరు ప్రస్తావించడం వల్ల చురుకైన ఇద్దరు సభ్యులను తెవికీ కోల్పోయిన సంఘటన తెలుసు కదా! ఈ పాయింటు వ్రాయడానికి అదే కారణం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు