వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 653:
@[[User:K.Venkataramana|వెంకటరమణ]] మీరన్నట్లు అది రెండు వాక్యాల వ్యాసం కాదు, 2007 నుంచి ఐదు వాక్యాలున్నాయందులో. నేను వ్యాసం రాస్తున్న సమయంలోనే ఆ వ్యాసపు రెండో దిద్దుబాటు ద్వారానే మొలక మూసను నేనే పెట్టాను. అది 5 వాక్యాల చిన్న వ్యాసం అని ఒప్పుకుంటాను కాని అలాంటి తక్కువ పరిమాణం కల వ్యాసాల తొలగింపు విషయంలో మినహాయింపులకై కూడా ఎప్పటినుంచో చెబుతున్నాను. ఎప్పుడూ చిన్న వ్యాసాలను సృష్టించే సభ్యుడికీ, పెద్ద వ్యాసాలను షృష్టిస్తూ తెవికీ అభివృద్ధిలో భాగంగా ఆ సభ్యుడి నుంచి జాలువారే కొన్ని చిన్న వ్యాసాలకు (ఒకట్రెండు వాక్యాల వ్యాసాలకు కాదు) తేడా ఉంటుందనీ కూడా నేను సంవత్సరాల నుంచి చర్చలలో చెప్తున్నాను. ఇక మూలాల విషయానికి వస్తే అసలు మూలం యొక్క ముఖ్యోద్దేశ్యం ఆ సమాచారం సభ్యుడు స్వంతంగా వ్రాయలేడనీ, ఏ ఒక్క చోటు నుంచి కాపీ చేయలేడనీ, పలు ఆధారాల నుంచి సమాచారం సేకరించాడనీ, సమాచారం సభ్యుడి స్వంత అభిప్రాయం కాదనీ, సమాచారంలో ఏదేనీ అభ్యంతరకర సమాచారం ఉన్నచో ఆ సమాచారం ఫలానా చోటు నుంచి తీసుకున్నాననీ ... ఇలా తెల్పడానికే మూలాలు ఉంచాల్సి ఉంటుంది. ఒక సభ్యుడు పెద్ద పరిమాణం కల సమాచారంను ఏదోసైట్ నుంచి కాపీ చేసి మూలం కూడా సూచించిననూ (అది పరిమాణం కల్గిన వ్యాసమూ, మూలం కల్గిన వ్యాసమూ అయిననూ) తక్షణమే తొలగించాల్సిన వ్యాసమే అవుతుంది. అందరు సభ్యులను ఒకే గాటన కట్టడం సరికాదని కూడా నేను ఏనాడో చెప్పాను. వారు తెవికీకి చేసి అభివృద్ధి పనులను కూడా చూడాలి. ఒక కొత్త సభ్యుడికి సంవత్సరాల నుంచి తెవికీకి సేవ చేసే సభ్యుడికి తేడా ఉంటుంది. ఎప్పుడూ చిన్న వ్యాసాలు సృష్టించే సభ్యుడికీ, తెవికీ అభివృద్ధిలో భాగంగా ఆయన సృష్టించిన చిన్న వ్యాసాలకు తేడా ఉంటుంది. ప్రస్తుతం మొలకలపై నియమాలు స్పష్టంగా లేవు, వాటిపై సమీక్షించడం అవసరం. ముందుగా మొలకల సీనియారిటీ పట్టికను తయారుచేసుకొని వాటి ప్రకారం (మినహాయింపు వ్యాసాలు పోగా) తొలగింపులు చేయాలి. సభ్యులపై చర్యలు తీసుకుంటూ పోతే తెవికీలో వ్రాసేవారు ఎవరూ మిగలరు. ఇప్పుడున్న సభ్యులలో కూడా అభద్రతాభావం ఏర్పడవచ్చు. ఇది తెవికీకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 11:30, 24 మే 2020 (UTC)
:::వికీపీడియా విధానాలు అందరికీ ఒకటే అనే భావనతో నిర్వాహకుల మొలక వ్యాసాలు కూడా చాలా తొలగించబడ్డాయి. అదే విధంగా కొందరు నిర్వాహకులు కూడా తమ మొలక వ్యాసాలను నియమాలకు విరుద్ధంగా ఉంటే తొలగించమని కోరారు. ఇక్కడ తొలగించడమే నిర్వాహకుల పని కాదు కదా. అలాగని ప్రాజెక్టులు చేస్తూ అనేక మొలక వ్యాసాలను విస్తరించామనే విషయాన్ని గమనించాలి. కొత్త వాడుకరి ఐదు వాక్యాలు గల వ్యాసాన్ని సృష్టించి మూలాలు చేర్చకుండా ఉంటే, దానిని నిర్వాహకుడు ప్రశ్నిస్తే మీ వ్యాసాలు కూడా అనేకం ఉన్నాయి, వాటిని ముందు సమీక్షించండి అనే అడుగుతారు. అందరికీ ఒకే నియమాలు ఉండాలి. మనం అనేక సంవత్సరాలుగా వికీలో పనిచేస్తున్న మాత్రాన మొలక వ్యాసాలు రాస్తే ఫరవాలేదంటే ఎలా? మనం కొత్త వాడుకరులకు ఆదర్శంగా ఉండాలి. మనం మన వ్యాసాలను విస్తరిస్తే గదా కొత్త వారికి చెప్పగలం. అందుకే మొదట ఎవరి మొలకలను వారు అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేసాం. కొంతమంది ఏదో కారణాల వల్ల చేయలేకపోయారు. వారి వ్యాసాలను కూడా విస్తరించాం. అందరూ వికీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు గానీ ఇందులో వ్యక్తిగత స్వార్థం ఏముంది? [[User:K.Venkataramana|''' <span style="font-family:Jokerman; color: #0047AB">K.Venkataramana</span>''']][[User talk:K.Venkataramana|(talk)]] 13:07, 24 మే 2020 (UTC)
::::నా అభిప్రాయాలు ముందు నుంచి స్పష్టంగానే చెబుతున్నాను. ఎవరో అడిగిప్పుడు చెప్పడానికి నియమాలు కూడా స్పష్టంగానే ఉండాలి. మొలక వ్యాసాల తొలగింపునకు కూడా స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పుడు ఎవరికీ భయపడే అవసరం ఉండదు. ఆ స్పష్టమైన నిబంధనల కోసమే నేను కోరుచున్నాను (అంతవరకు కఠిన చర్యలకూ వ్యతిరేకినే). నేను కేవలం ఒక్క వ్యాసం కోసం పట్టుబడలేను (ఉదా: కోసం ఆ వ్యాసం చూపించాను అంతే). ఒక ఆర్థికశాస్త్ర వ్యాసాన్ని అభివృద్ధి చేయాలంటే నాకు చిటికెలో పని, కాని అలాంటివి వందలాదిగా (ఉండొచ్చు?) ఉన్న ఐదు-పది వాక్యాల వ్యాసాల కోసమే నా ప్రయత్నం. ఒకట్రెండు వాక్యాల వ్యాసాల విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. ఐదువాక్యాల వ్యాసాలు ఎవరు వ్రాసిననూ తొలగింపునకు నాకు వ్యక్తిగతంగా ఇష్టంలేదు. ఇదింకనూ అభివృద్ధి చెందుతున్న వికీనే కాబట్టి వ్యాస పరిమాణంపై ఇలాంటి కఠిన నియమాలు అవసరం లేదనుకుంటా. కొత్త వాడుకరులకు ఆదర్శంగా ఉండాలంటే సీనియర్ సభ్యులు కొత్తవారికి ప్రోత్సాహం అందిస్తూ వ్యాస అభివృద్ధికి తోడ్పడాలి అంతేకాని వారు సృష్టించే చిన్న వ్యాసాలను తొలగించడం కాదుకదా! ఉద్దేశ్యపూర్వకంగా అన్నీ చిన్న వ్యాసాలను సృష్టించే సభ్యులపై మాత్రం క్రమపద్దతిలో చర్యలు తీసుకోవచ్చు. లక్షలు చేతులుమారే గూగుల్ అనువాదవ్యాసాలపై కారుణ్యం చూపే అవసరం ఏ మాత్రంలేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 14:42, 24 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు