పెంపుడు కొడుకు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సావిత్రి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 9:
starring = [[ఎల్.వి.ప్రసాద్]],<br>[[పుష్పవల్లి]],<br>[[సావిత్రి]],<br>[[కుమారి (నటి)|కుమారి]],<br>[[ఎస్.వి.రంగారావు]]|
}}
'''పెంపుడు కొడుకు''' 1953, నవంబరు 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1953_8280.html{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==కథ==
రంగస్వామి (ఎల్.వి.ప్రసాద్) భార్య మంగమ్మ ([[పుష్పవల్లి]]) ఆస్పత్రిలో జబ్బుగా ఉంటుంది. ఇద్దరు పిల్లలను ఒక్కడే సాకడానికి యిబ్బంది పడుతుంటాడు. భార్య బ్రతకదేమోనన్న భయంతో చంటివాణ్ణి ఒక ధనికురాలికి (కుమారి) పెంపకం ఇస్తాడు. ఆమె వాణ్ణి తీసుకుని స్వస్థలం వేలూరు వెడుతుంది. మంగమ్మ ఆస్పత్రి నుంచి బతికి బయట పడుతుంది. రెండో పిల్లవాడు పెంపకం వెళ్లాడని తెలిసి భర్తను నిందిస్తుంది. రంగస్వామి వేలూరు వెళ్లి పిల్లవాడిని తిరిగి తీసుకురావడానికి అవసరమైన డబ్బుకోసం ఒక యిల్లు కట్టడం పనిలో చేరుతాడు. ప్రమాదవశాత్తు ఆ యింటి దూలం విరిగి మీదపడి మరణిస్తాడు. మంగమ్మ దుఃఖించి పెద్ద కొడుకుని వెంట బెట్టుకుని వేలూరు వెడుతుంది. అక్కడ ఒక హత్యానేరంలో చిక్కుకుని పదిహేనేళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. పెద్దకొడుకు దిక్కులేనివాడై ఒక బడిపంతులు సౌజన్యం వల్ల అచ్చాఫీసులో నౌకరుగా పని చేస్తాడు. ఆ వూళ్లోనే ప్రొఫెసరు దంపతుల వద్ద రెండో కొడుకు పెరుగుతుంటారు. ఇద్దరూ (శ్రీరామమూర్తి, శివాజీ గణేశన్) పెద్దవారవుతారు. తామిద్దరం అన్నదమ్ములమని తెలియక ఇద్దరూ చిన్నతనం నుండే వైరం పెంచుకుని, గౌరి (సావిత్రి) అనే యువతి ప్రేమకోసం ఇంకా ప్రబల విరోధులవుతారు. ఈ లోగా మంగమ్మ జైలు నుండి విడుదలై ప్రొఫెసరు గారి ఇంట్లో వంటలక్కగా చేరుతుంది. తలవని తలంపుగా పెద్ద కొడుకును కలుసుకుంటుంది. ప్రొఫెసర్ ఇంట్లో పెరిగే మోహన్ తన రెండవ కొడుకేనని గ్రహిస్తుంది. మోహన్ తను ధనికుల బిడ్డననే గర్వంతో దుష్టుడై తన అన్నపైన, గౌరిపైన దొంగతనం నేరం మోపి జైలుకు పంపిస్తాడు. కాని వారు విడుదల అవుతారు. చివరకు అతడు ఇంతకాలం తను ద్వేషిస్తున్న మంగమ్మ తన తల్లే అని, ముత్తడు తన అన్న అనీ గ్రహిస్తాడు. పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకుంటాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26781 ఆంధ్రపత్రిక దినపత్రిక - నవంబరు 15, 1953, పేజీ:9]</ref>.
"https://te.wikipedia.org/wiki/పెంపుడు_కొడుకు" నుండి వెలికితీశారు