పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎థీమ్స్, ప్రభావాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 81:
 
== థీమ్స్, ప్రభావాలు ==
సినిమాలో కృష్ణారావుప్రతాప్(అక్కినేనిఆర్.నాగేశ్వరరావ్) పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని [[జర్మనీ]] నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని [[ప్రపంచయుద్ధం]] ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు. అయితే నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ మాత్రం యుద్ధక్షేత్రంలో వేలాది నౌకలతో సమానంగా పోరాడటం కన్నా, ప్రత్యేకంగా యుద్ధానికి దూరంగా [[ఇంగ్లాండు]] కాలనీలపై దాడులుచేసి శత్రువులను గందరగోళంలో పడేస్తానన్నాడు. ఒంటరి నౌకతో అన్ని నౌకలను ఎదుర్కోవడం ప్రమాదకరమని, ఐతే అంతటి సాహసముంటే ముందుకువెళ్ళమని అనుమతించారు. ఆ క్రమంలో ఆ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో బ్రిటీష్ నౌకగా భ్రమకల్పిస్తూ బ్రిటీష్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తీరానికి వచ్చి [[చెన్నై|మద్రాసు]] తీరంలో [[పెట్రోలుబంకు]]లు పేల్చేసింది. అయితే కెప్టెన్ కి తీరంలోని వలస ప్రజలపై దాడిచేసే ఉద్దేశం లేకపోవడంతో అతితక్కువ జననష్టం, భారీగా ఆస్తినష్టం జరిగాయి. అయినా జరిగిన కల్లోలానికి [[మద్రాసు]] ప్రజలు నగరం నుంచి కొన్నాళ్ళు పారిపోయారు, దోపిడీలు జరిగాయి. దాంతో యమ్‌డన్‌ అనే పదానికి శక్తివంతమైన, తీవ్రమైన, పెద్ద అన్న అర్థాలు తమిళ, మలయాళ, సింహళ భాషల్లో చోటుచేసుకున్నాయి. ఈ సినిమాలో కృష్ణారావుప్రతాప్ పాత్ర సైనికుడు కావడంతో యమ్‌డన్‌ అన్న ఊతపదానికి ఔచిత్యం కూడా కుదిరింది.<ref name=యమ్‌డన్‌>{{cite web|last1=యమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 1|url=telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
==మూలాలు==