గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
గాలివాన కథ తొలుత ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలో 1951 మే 13న ప్రచురితమైంది, తిరిగి 1952 మార్చి 19 న అదే పత్రికలో పున:ప్రచురణ పొందింది.<ref name="కథానిలయం పద్మరాజు వివరాలు">{{cite web|title=రచయిత:పాలగుమ్మి పద్మరాజు|url=http://kathanilayam.com/writer/36?Story_page=2|website=కథానిలయం|publisher=ఎం.వి.రాయుడు, కాళీపట్నం సుబ్బారావు, టి.శ్యామనారాయణ, వివిన మూర్తి, ఎం.వి.రమణమూర్తి|accessdate=5 June 2015}}</ref> న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పురస్కారం పొందినాకా ప్రపంచంలోని పలు భాషల్లోకి కథ అనువాదమైంది.<br />
 
గాలివాన కథని పాలగుమ్మి పద్మరాజు ప్రముఖ రష్యన్ రచయిత ''[[మాక్సిం గోర్కీ|గోర్కీ]]'' రాసిన ''ద ఆటమ్ నైట్'' కథ నుంచి స్వీకరించారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ కథలో లేని దృక్పథాల వైరుధ్యం, మార్పు వంటివి చేరుస్తూ కథను అద్భుతంగా మలిచారని భావించారు.<ref name="గాలివానపై ప్రభావాలు ఖదీర్" /> 1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా విపరీతమైన గాలివాన వచ్చి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉందామా, బయటకు పారిపోదామా అని ఊగిసలాడుతూన్న సమయంలో పద్మరాజు బయటకి రావడం, భార్య ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు ఆమెపై కూలిపోయింది. కాపాడేందుకు వచ్చిన ఆయన విద్యార్థుల సహాయంతో ఆమెను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఆమె బతికిందో లేదో, బ్రతికేవుంటే బతుకుతుందో బతకదో కూడా తెల్లారేవరకూ తెలియని దుస్థితిలో ఆ రాత్రి గడపాల్సివచ్చింది. ఆమె శరీరమంతా గాయాలతో చాన్నాళ్ళు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు. ఈ దుర్భరమైన అనుభవం నుంచే కథలోని గాలివాన చిత్రణ, గాలివాన రాత్రి ప్రధాన పాత్ర పొందిన వేదన, భయం వంటివాటి చిత్రణను స్వయంగా తన జీవితం నుంచే స్వీకరించివుండొచ్చని సాహిత్యకారుడు, పాత్రికేయుడు [[నరిశెట్టి ఇన్నయ్య]] పేర్కొన్నారు. <ref name="నరిశెట్టి ఇన్నయ్య-పద్మరాజు">{{cite web|last1=నరిశెట్టి|first1=ఇన్నయ్య|title=సాహిత్యపరులతో సరసాలు|url=http://naprapamcham.blogspot.in/2008/07/blog-post_26.html|website=నా ప్రపంచం|publisher=నరిశెట్టి ఇన్నయ్య|accessdate=5 June 2015|archive-url=https://web.archive.org/web/20160306232630/http://naprapamcham.blogspot.in/2008/07/blog-post_26.html|archive-date=6 మార్చి 2016|url-status=dead}}</ref>
 
== ఇతివృత్తం ==
కథలోని ప్రధాన పాత్రల్లో ఒకటి రావుగారి పాత్ర. ఆయన సంఘంలో గౌరవమర్యాదలు, పేరుప్రతిష్టలు కలిగినవారు. వకీలుగా పనిచేసి కొడుకు వకీలు పరీక్షలు నెగ్గాకా తన ప్రాక్టీసును అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నవారు ఆయన. ఆయన జీవితంలో ప్రతీ విషయంపైనా ఒక నియమాన్ని ఏర్పరుచుకుని అందుకు అనుగుణంగా జీవిస్తూంటారు. కుటుంబంలోని ప్రతివారినీ తన క్రమశిక్షణకు అనుగుణంగా నడుపుతూంటారు, చివరకు కూతుళ్ళ తలకట్టు ఎలావుండాలో కూడా రావుగారే నిర్ణయించేది. తత్త్వవేత్తగా తనను తాను భావించుకునే రావుగారికి ఉపన్యాసాలపై ఆసక్తి ఎక్కువ. దానితో వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు "సత్వము-తత్త్వము", "ప్రకృతి-పరిష్కృతి" లాంటి పేర్లతో ఉపన్యాసాలు ఇస్తూంటారు.(అయితే శీర్షికలను విషయాన్ని బట్టి కాకుండా శబ్దాలంకారాలపై మోజుతో నిర్ణయించుకుంటూంటారని వారి స్నేహితుల వేళాకోళం) కథ ప్రారంభమయ్యే సమయానికి ఆయన ఆస్తిక సమాజం వారి ఆహ్వానం మేరకు "సామ్యవాదము-రమ్య రసామోదము" అన్న అంశంపై ప్రసంగించేందుకు రైలు ప్రయాణంలో ఉంటారు. వారున్న బెర్తుల వద్దకు అడుక్కునేందుకు వచ్చిన బిచ్చగత్తెను అసహ్యించుంటారు. అయితే ఆ రాత్రి మెల్లగా ప్రారంభమైన వాన అత్యంత తీవ్రమైపోతుంది. తాను దిగాల్సిన స్టేషన్లో బెడ్డింగు, సామాన్లతో సహా రావుగారు దిగుతారు. అయితే ఆ తీవ్రమైన గాలివానలో, రైల్వేస్టేషన్లో తాను అసహ్యించుకున్న బిచ్చగత్తెతో పాటుగా చిక్కుకుంటారు.
 
అంతటి వేదాంతి అయిన రావుగారు ఆ స్టేషన్లో గాలివాన బీభత్సానికి భయపడిపోతారు. అయితే జరుగుతున్న క్షణంతోనే తప్ప గడిచిన గతం, రానున్న భవిష్యత్తులతో ఏ సంబంధం పెట్టుకోని 30ఏళ్ళ బిచ్చగత్తె మాత్రం ధైర్యంగా ఉంటుంది. అతనికి చలివేస్తుంటే తన చుట్టూ చేతులు వేసుకొమ్మంటుంది, ధైర్యం చెప్తుంది. ఆ రాత్రి ప్రాణాలు కాపాడుతుంది. అయితే తెల్లవారేసరికి ఆమెకి ఏమైంది, తద్వారా తన జీవితంలో ఇన్నాళ్ళూ కాపాడుకుంటూ వచ్చిన విలువలు, నమ్మకాలు, తాత్త్వికత, ధర్మం వంటివన్నిటినీ రావుగారు ఎలా పునర్నిర్వచించుకున్నారు అన్నది కథాంతాన్ని బట్టి తెలుస్తుంది.<ref name="నెమలికన్నులో గాలివాన గురించి">{{cite web|last1=నెమలికన్ను|first1=మురళి|title=గాలివాన|url=http://nemalikannu.blogspot.in/2010/01/blog-post_06.html|website=నెమలికన్ను|publisher=మురళి|accessdate=5 June 2015|archive-url=https://web.archive.org/web/20150629200212/http://nemalikannu.blogspot.in/2010/01/blog-post_06.html|archive-date=29 జూన్ 2015|url-status=dead}}</ref>
== శైలి ==
=== శీర్షిక ===
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు