హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
బతుకమ్మను సుమారు గంట నుండి రెండు గంటల వరకు ఆడినతర్వాత, బతుకమ్మను నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులుకూడా పట్టుకపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, [[పసుపు]] కుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు.
 
బతుకమ్మకు ఒక్కరోజు విరామం తర్వాత వచ్చే దసరా పండుగ, హన్మకొండలో జరుపుకోనే పండుగలలో ప్రధానమైనది, ముఖ్యమైనదికూడా. దసరా రోజు ప్రతి ఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి [[కొబ్బరికాయ]] కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమలవారు మిషిన్లకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళుకూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్నికూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలూ అందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు లేదా ఉరుసు గుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతివొక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మియాకు తీసుకొని, పాలపిట్టను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను, నృత్య ప్రదర్శనలు, వివిధ కళాకారుల ప్రదర్శనలు చూసి ఇంటికి వస్తారు. గుట్టదగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చినతర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మిఆకూ చేతిలపెట్టి కాళ్ళకుమొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు.
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు