వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చదువరి స్పందన: భాషా సవరణలు చేసాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 714:
విస్తరణ, శుద్ధి, అనువాదం వంటి నిర్వహణ మూసలు అనేకం పెడుతూ ఉన్నాం మనం. కొన్ని వ్యాసాలకైతే, పలు సమస్యలున్నయంటూ ఒకటి కంటే ఎక్కువ మూసలు పెట్టడం కూడా చేసాం, చూసాం. కానీ ఎన్నిటికి సంబంధిత సవరణలు జరిగాయి.. పెద్దగా జరగలేదు. నిర్వహణ అవసరమైన పేజీలు వందలూ వేలూ ఉన్నాయి. నిర్వహణ మూసలు పెట్టమని సలహాలివ్వడం బహు తేలిక. కానీ ఆ మూసలు పెట్టినా ఆ పనులు కావు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాడుకరుల సంఖ్య చాలా తక్కువ. ఆ నోటీసులు పెట్టిన వ్యాసాలు ఏళ్ళకేళ్ళు అలాగే పడి ఉంటున్నాయి. వాటిని సృష్టించిన వాడుకరులు కూడా వాటిని విస్తరించేందుకు, మూలాలను చేర్చేందుకూ ముందుకు రాకపోతే ఏం చెయ్యాలి? [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&oldid=2942172#%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%95_%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B0%BF_%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87_%E0%B0%8F%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF వెంకటరమణ గారి లాగా], ఇతరుల్లాగా చేతనైనంతలో తగు మార్పులు చేసి, తన వల్ల కానివాటిని తొలగింపుకు ప్రతిపాదించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలా? లేక చంద్రకంతరావు గారి లాగా వారి పనుల్లో కంతలు వెతకాలా?
__[[User:Chaduvari|చదువరి]] ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]]) 12:10, 26 మే 2020 (UTC)
:: చదువరి గారూ, తెవికీలో ఇటీవల జరిగిన పొరపాట్లు బయటపెడితే విమర్శలంటూ, నన్ను విమర్శిస్తూ, నా పై అభాండాలేస్తూ, తిట్ల పరంపరను కొనసాగిస్తూ (బూతులొక్కటే తక్కువ), కోపంతో రగిలిపోతూ, ఆవేశాన్ని గుమ్మరిస్తూ నా తెవికీ చరిత్ర మొత్తం శోధించి మొత్తంపై కొండను త్రవ్వి ఎలుకను పట్టి వింతైన సమాధానం ఇచ్చినందుకు ముందుగా థాంక్స్.
1) అపార్థం చేసుకోకుండా ఉండేలా చెప్పలేకపోయానంటూనే మళ్ళీ "మీపట్ల సానుకూలంగా ఉన్న వ్యక్తి కూడా..." అంటూ ఎందుకండి చదువరి గారూ. మీ ఉద్దేశ్యం ఏంటో నాకక్కరలేదు, సమర్థన అని ఎందుకు రాశారని అడిగితే మీరిచ్చే సమాధానం ఇదా! ఒక తప్పును కప్పిపుచ్చేందుకు మరో తప్పు చేస్తారా?
2) మీకు హెచ్చరిక అంటే ఏంటో తెలుసా చదువరి గారు. అది తెలుసుకొని మాట్లాడండి.
3) "విచారణ లేకుండా పేరు బయట పెట్టకూడదా? విచారణ చెయ్యాలంటే పేరు చెప్పాలి కదా?" అని అంటున్నారు. ఎలా బయట పెడతారండి? చదువరి గారు. "ఏంటీ చోద్యం? బండికి వెనకాల ఎద్దుల్ని కట్టడమంటే ఇదే" అంటూ మాటలు బాగానే చెబుతున్నారు కాని కనీస అవగాహన, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. విచారణకు ఎవరైనా అసలు పేరు చెబుతారా? సాక్‌పప్పెట్ సభ్యుల పేర్లు చెప్పి వీరి అసలు సభ్యులెవరో కనుగొనాలని చెప్పాలి కాని ప్రసాద్ అనో మరో పేరో ఎలా చెబుతారు? మీ సమాధానం ఏ మాత్రం సరైనది కాదండి. ఇలాంటి సమాధానాల వల్ల చదివిన వారు సిగ్గుపడతారు.
4) అయ్యా నేను రంధ్రాన్వేషణ చేస్తానా మరేమి చేస్తానా అనేది మీకెందుకు చదువరి గారు. ఇక్కడ యజమానులు, బానిసలంటూ ఎవరూ ఉండరు. కొందరు మేస్త్రీల అవతారం ఎత్తి ఇతరులను కూలీలుగా భావించడం తగదని చర్చలలో చూడలేరా?. అందరూ మీకు నచ్చిందే చేయాలని ఏమీలేదు. నియమాలు అతిక్రమించనంతవరకు ఎవరికిష్టమైన పని వారు చేసుకోవచ్చు. సర్దుకోక తప్పదు చదువరి గారు. ఇలాంటి విషయంలో మీ వాదన పనికి రాదండి.
5) పని చేసేవాళ్ళపై దాడి చేస్తున్నట్లుగా చిత్రీకరించడం తగదండి చదువరి గారు. మీ సమాధానాలు ఏమాత్రం సరైనవిగా లేవు. నన్ను నిర్దేశించించేందుకు ఇక్కడ మీరేమి నా యజమానులు కారని గుర్తించుకోండి. పొరపాట్లు బయటపెడితే ఎవరు దాడికి దిగుతున్నారో గుర్తించుకోండి.
6) "ఒకసారి విధానం ఏర్పడ్డాక, మీ అభిప్రాయం ఏదైనా సరే.., దాన్ని పక్కన పెట్టాల్సిందే.." అన్నారు. ఇదేం సమాధానమండి. నియమోల్లంఘనకు, నియమాల ప్రక్షాళనకు తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. నియమం ఖరారైనా నియమాల మార్పుకై ప్రయత్నించడం, చర్చను తీయడం, అభిప్రాయం తెల్పడం, ఉన్న నియమాలు సరిగాలేవనీ, నియమాలలో లోపాలున్నాయనీ ... ఇలా చెప్పడం తప్పెలా అవుతుందో ఆలోచించండి. ప్రజాస్వామ్య పద్దతి ఏంటొ కొద్దిగానైనా తెలుసుకోండి. నియంత పాలనకు ప్రజాస్వామ్యానికి తేడా ఉంటుందని గ్రహించండి. ఇలాగైతే దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా నియమాలు మార్పు చెందవు చదువరి గారు. ఏం ఆలోచిస్తారండి. మార్పు చెందరాదనీ లేదా మీరొక్కరే మార్పుకై ప్రతిపాదన చేయాలనుకుంటే అది తప్పండి చదువరి గారు. దయచేసి మీ వైఖరి మార్చుకోండి.
7) "సభ్యులపై చర్యకు ... పాతిక? పోనీ యాభయ్యేళ్ళు?" అని ఎందుకు ఆవేశపడుతున్నారు చదువరి గారు. సభ్యులపై నిరోధం మాత్రమే ముఖ్యమనీ ఎందుకంటున్నారు. ముందు నియమాలు చక్కదిద్దుకుందాం అని తెలుసుకోలేరా? మీ ఆవేశానికో నమస్కారమండి చదువరి గారు.
8) "దుమ్మెత్తి పోయడానికి వస్తారు.." అంటూ విమర్శిస్తున్నారు. చేసిన పొరపాట్లండీ అవి. ఆ మాత్రం కూడా చెప్పకుంటే ఎలాగా? ఏమీ చెప్పరాదు అని అనడానికి ఇది మీ స్వంత బ్లాగు కాదు కదా చదువరి గారు. తెవికీలో ఎవరు ఏ బాధ్యతనైనా తీసుకోవచ్చు అని తెలుసుకోండి. ఈ విషయం నేను గతేడాదే చెప్పాను.
9) పనిచేసేవాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అంటున్నారు. అదికాదండి పొరపాట్లు సరిదిద్దుకోవడం ముఖ్యమండి చదువరి గారు. నియమాలు తెలిసిన వారుంటారు, తెలియని వారుంటారు, తెలుసుకొనేవారూ ఉంటారని గుర్తించుకోండి. మీకు నచ్చకుంటే గప్పుగుండండి చాలు. సరిదిద్దుకొనేవాళ్ళు సరిదిద్దుకుంటారు. ఎవరికీ లేని ఆవేశం మీకెందుకు?
10) నా ధోరణి ప్రమాదకరం అంటున్నారు కాని మీ మాట వినని ఒక్కొక్కరిని ఇంటికి సాగనంపుతున్నారు. ఇదే చాలా ప్రమాదము చదువరి గారు. తెవికీ మొత్తం ఖాళీ అవుతుంది అప్పుడెవ్వరూ మిగలరు. ఇప్పటికే తెవికీ ఊబి నుంచి మరింత ఊబిలోకి దిగజారుతోందని గుర్తించుకోండి.
11) మారుపేరుతో రాసే వాడుకరికి నేను మారుకరి అని సంక్షిప్తనామం ఇస్తే మీకెందుకండి బెంగ? ఇదీ ఒక ఆక్షేపణనా? ఇదీ అభ్యంతరకరమా? ఇదేమైన తిట్టా? "ఈ ముసుగులెందుకు? ఇలా దొంగదెబ్బ తీయడమెందుకు?" అంటూ ఏవేవో అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మరి అసలుపేరు ఆధారం లేకుండా ఎలా చెప్పాలి చదువరి గారు. ఆధారం లేకుండా చెప్పడమే తప్పు అని అర్థం చేసుకోలేరా? మీరు ఆవేశంతో అన్నీ తప్పుడు సలహాలిస్తున్నారు కాని నేను అలా చేయను. కొత్త సభ్యులు గట్టిగా ఏదైనా రాస్తే మీరు ఏమంటారో తెలుసా? "మర్యాద అనేదొకటుంది మరవకండి" అని, మరిప్పుడు?
12) సకల జనుల సమ్మెపై మండలాలలో నేను AWB ద్వారా చేర్చిన సాధారణ సమాచారం గురించి బాగా శోధించారు చదువరి గారు. కొండను తవ్వి ఎలుకను బాగానే పట్టారు. అదొక్కటే తప్పుకానితప్పు దొరికింది! తెలంగాణ మండల వ్యాసాలలో సమ్మె విభాగాన్ని పరిపూర్ణం చేయాలనే ప్రత్యేక ఉద్దేశ్యంతో అన్ని మండలాలకు చెందిన మూలాలు కూడా సేకరించాను. ఆ తర్వాత ఆ పని జరగలేదనుకోండి. తర్వాత దాన్ని మర్చిపోయాం. దానికి కారణం మీకు చెప్పే అవసరం లేదు. చెప్పినా అర్థం చేసుకోరు. మీకెందుకండి ఈ బెంగ. ఇందులో నా స్వార్థప్రయోజనం ఉందా? మీ వాదనలో పసలేదు. "మీ స్వప్రయోజనాల కోసం వికీని వాడేసుకున్నారు" అన్నారు, ఊరికే చెప్పడం కాదు ఆధారం చూపించండి. మీ వాదన హాస్యాస్పదంగా ఉంది.
13) పొరపాట్లు చెబితే "నిర్వాహకులపై ద్వేషం" అంటూ విమర్శిస్తున్నారు. ఏది చేసినా ఎవరేమీ చెప్పరాదని మీ ఉద్దేశ్యమా? ఇలా కుదరదు చదువరి గారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోకున్నా సరే కాని చెప్పింది అర్థం చేసుకోండి చాలు. నేను చెప్పే పొరపాట్లలో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి అంతేకాని ఆవేశంతో తగిలిపోతూ రెచ్చగొడుతూ రాయడం సరికాదు.
14) ఇతరుల పనుల గురించి మీరు నాకు చెప్పే అవసరం లేదు. వచ్చినప్పుడు మీ చర్యలతో పాటు అందరివీ గమనిస్తాను. అది మీకంటే నాకే ఎక్కువ తెలుసు. కావాలంటే వెంకటరమణ గారిని ఆదర్శంగా తీసుకోండి. నేను సంవత్సరాల తరబడి ఆయన చర్యల్ని చూస్తున్నాను. పొరపాటేమీ చేయరు. తెలిపితే ఇతరుల పొరపాట్లను కూడా సరిదిద్దుతారు. మీలా లేనిపోని ఆవేశం తెచ్చుకొని మాటలు కక్కరు.
15) మీరేమి చేసినా ఎవరూ ఏమీ చెప్పరాదని అనుకోకండి చదువరి గారు. ఇటీవలి పొరపాట్లు అంటూ నేను చర్చతీస్తే దానికి అర్థంపర్థం లేని సమాధానమిచ్చారు. పొరపాట్లు తెల్పితే దాడి అంటారు, నిర్వాహకులపై ధ్వేషం అంటూ చిత్రీకరిస్తారు, దుమ్ముదులిపే వ్యక్తిగా భాష్యం చెబుతారు. ఆరు పాయింట్లు రాస్తే వాటికి సరైన సమాధానం ఇవ్వకుండా (సమాధానం ఇవ్వాలనీ కూడా ఏమీ లేదని గుర్తించుకోండి, మొదటి పాయింటుకు మాత్రమే వివరణ అడిగాను, గుర్తించుకోండి) నా తెవికీ చరిత్ర మొత్తం పరిశోధించారు. పొరపాట్లు చెబితే కెలకడం అంటున్నారు కాని ఎవరు కెలకడం ప్రారంభించారో ఆలోచించండి. మరి నేనూ మీ తెవికీ చరిత్ర పరిశోధిస్తే కుప్పలుగా పొరపాట్లు బయటపడితే ఎంత ఆవేశం తెచ్చుకుంటారో చదువరి గారు.
16) "... ఆ తరువాత ఆ చర్చలో మళ్ళీ కనబళ్ళా మీరు. ఇదీ మీ బాధ్యత ..." అంటూ విషం కక్కకండి. నాకున్న వృత్తి బాధ్యతల వల్ల ఇక్కడికి రోజూ వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదు. తెవికీ సెలవులో ఉన్నప్పుడు మెయిల్ పంపొచ్చుగా? (బొట్టు పెట్టి పిలవాలా అని విమర్శిస్తారేమో! అలాంటప్పుడు చర్చలోకి రానివాళ్లకు విమర్శించే హక్కులేదని కూడా గుర్తించుకోండి) ప్రసాద్ గారిపై చర్య తీసుకొనే ముందు నాకు 2 సార్లు మెయిళ్ళు పంపి చర్చలోకి లాగిన సంగతి గుర్తుందా! అంటే సభ్యులపై నిరోధాలు, కఠిన చర్యలకు ఇచ్చిన ప్రాధాన్యత మిగితా సమయంలో మీరు ఇవ్వరన్నమాట!! ఇదీ సంగతి ! మీ అసలు ఉద్దేశ్యమేమిటో తెలుస్తోంది చదువరి గారు.
17) సందర్భాన్ని బట్టి గతానుభవాలు చెప్పాను, దాన్ని స్వోత్కర్ష అనుకున్నా నాకభ్యంతరం లేదు. కాకుంటే నా గత తెవికీ పనులు విని ఈర్ష్యపడితే ఎలాగండి. ఇది కూడా ఒక అభ్యంతరమా? ఏం శోధన చేశారు చదువరి గారు! సందర్భానుసారం చెప్పేమాటలకు కూడానా? ప్రతి ఒక్కరు మీకు నచ్చే మాటలనే రాయాలంటే కుదరదు. నేను చురుకుగా పనిచేసిన కాలంలో తెవికీ మహోన్నతస్థాయిలో ఉండేదని కూడా చాలా సార్లు తెల్పాను. మరి అది రాయలేదే! ఉన్న వాస్తవం చెబితే ఈర్ష్య పడితే ఎలాగండి!
18) JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదనలో "మర్యాదగా వ్యవహరించరు. పిచ్చిరాతలు, చెత్త రాతలు, ఎవడు, కెలకడం, అతిగా, అతి తెలివిగా పత్తిత్తు వంటి మాటలు వాడుతూ ఉంటారు" అంటూ రాశారు. మరి ఇప్పుడు మీ భాష ఎలా ఉందో ఆవేశం తగ్గాక ఒకసారి పరిశీలించండి. దొంగదెబ్బ తియ్యలా, ఈ ముసుగులెందుకు? ఇలా దొంగదెబ్బ తీయడమెందుకు?, సూర్యుడిపై ఊసే ఉమ్ము, కెలకడం ... అంటూ ఇవేమి మాటలండి. ఈ మాటలన్నీ మూటకట్టి మీకే ఇస్తున్నాను స్వీకరించండి.
19) మీ చర్యల వల్ల తెవికీ ఎంత దెబ్బతిందో పరిశీలన చేయాల్సి ఉంది. కఠిన నియమాలు మరియు వికీ మూలనిబంధనలకు వ్యతిరేకంగా పాలసీలు ప్రతిపాదించి అమలులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. (పూర్తి వివరాలు పరిశీలన తర్వాత బయటపడతాయి)
20) మీరు ఏదిచేసినా సభ్యులు, నిర్వాహకులు సమర్థంచాలనీ, మీ పొరపాట్ల గురించి చెప్పే సభ్యుడిని పూర్తిగా అణగద్రొక్కాలనేది మీ వ్యూహంలో భాగం కావచ్చు కాని తెవికీపై ప్రేమ ఉన్న వారెవరూ మీకు భయపడరని గుర్తించుకోండి. సభ్యులను, నిర్వాహకులను అణగద్రొక్కే పద్దతిని మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాను.

తెవికీలో జరిగిన పొరపాట్లను లేవనెత్తితే చురుకైన నిర్వాహకుడిగా సానుకూలంగా ఆలోచించడం మాని ఎదురుదాడికి దిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అది ఆవేశమా? విచక్షణ కోల్పోయి రాశాడా? అసలు నైజమా? రెచ్చగొట్టడానికి రాశాడా? పొరపాట్లను తెలుసుకొనే శక్తి లేదా? మరోసారి పొరపాట్లు లేవనెత్తరాదనా? దాడి చేయడమే ఉద్దేశ్యమా? మరే ఉద్దేశ్యమో తెలియదు కాని ఈ రాతలను, వాడిన భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ రాసిన రాతలు స్థాయికి తగ్గట్టుగా లేవు. బయటివారు చూస్తే తెవికీ నిర్వాహకులు ఇలాంటి భాష కూడా వాడతారా అని సిగ్గుపడిపోతారు. ఆవేశంతో, కోపంతో రాసినది తప్ప సమాధానంలో ఎలాంటి పసలేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao| సి. చంద్ర కాంత రావు]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|- చర్చ ]] 16:20, 27 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు