ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
ఈ ప్రాంతాలలో దొరికిన వేర్వేరు శాసనాల ఆధారంగా [[ములుకనాడు]] వివిధ రకాలుగా పిలువబడేది. ములకనాడు బ్రాహ్మణుల యొక్క మూలాల కోసం అన్వేషిస్తే ఈ వర్గం [[కడప జిల్లా]]లోని [[పెన్నా నది]] కేంద్ర పరీవాహక ప్రాంతానికి చెందిన తెలుగు వారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతం వివిధ కాలాల్లో వివిధ పేర్లతో వ్యవహరించబడింది. పుణ్య కుమారుడు ఈ [[దొమ్మరనంద్యాల]] ప్రాంతాన్ని హిరణ్య రాష్ట్రంగా ప్రస్తావించాడు. మొట్టమొదటగా ఈ ముల్కినాడు ప్రాంతం గురించి అధికంగా [[పుష్పగిరి]] లోని శాసనాల ద్వారా [[రాష్ట్రకూట]] రాజు అయిన కృష్ణుడు ద్వారా '''ముల్కినాడు నాయుడు మహారాజ్యం'''గా అధికంగా ప్రస్తావించబడింది<ref>https://books.google.se/books?id=ud_zjw5OLOEC&pg=PA68&lpg=PA68&dq=Mulkinadu&source=bl&ots=8uRG4QNpa1&sig=KlTyxKCiVyDZilXZnqgd_GNaK9k&hl=en&sa=X&ved=0ahUKEwio7sqY5ZDWAhVjP5oKHQadBO4Q6AEILjAC#v=onepage&q=Mulkinadu&f=false</ref>. ఈ ప్రాంతం ముల్కినాడుతో పాటు ఈ ప్రాంతములోని కొన్ని ప్రాంతాలు [[రేనాడు]], [[మార్జావడి]], [[పొత్తాపినాడు]], [[పెదనాడు]] మొదలగు విధములుగా పిలువబడినాయి.
 
1214 శకం(1292 CE)లో [[కాయస్థ అంబదేవుడు|కాయస్థ అంబదేవు]]ని ([[కాకతీయులు|కాకతీయు]]ల [[రుద్రమదేవి]] పాలనలో దక్షిణ ఆంధ్ర సామంత పాలకుడు) ఇంకొన్ని శాసనాలలో ముల్కినాడుతో పాటుగా [[పులివెందుల|పులివెండ్ల]] (ప్రస్తుత [[పులివెందుల]]), [[పొత్తాపి]], [[పెనావది]], [[సిరివోడు]] లను ప్రస్తావించారు<ref>https://books.google.se/books?id=ud_zjw5OLOEC&pg=PA68&lpg=PA68&dq=Mulkinadu&source=bl&ots=8uRG4QNpa1&sig=KlTyxKCiVyDZilXZnqgd_GNaK9k&hl=en&sa=X&ved=0ahUKEwio7sqY5ZDWAhVjP5oKHQadBO4Q6AEILjAC#v=onepage&q=Mulkinadu&f=false</ref>.
 
1289 CE నుండి 1323 CE వరకు పరిపాలించిన [[కాకతీయ]] [[ప్రతాప రుద్రుడు]] 1319 CE లో [[కడప జిల్లా]]లోని [[సిద్దవటం]] లో ''[[చందువోయి శాసనం]]'' లో ముల్కినాడు గురించి పేర్కొన్నాడు<ref>{{Cite web|url=https://archive.org/stream/in.ernet.dli.2015.531155/2015.531155.early-history_djvu.txt|title=Full text of "7 నుండి 11 వరకు పురాతన దక్కను చరిత్ర "|website=archive.org|language=en|access-date=2017-09-06}}</ref>. పలు శాసనాలు, సమీప ప్రాంతాల చరిత్రలు పరిశీలించిన మీదట [[కడప జిల్లా|కడప]] ప్రాంతంకి [[ములుకనాడు]] లేదా [[ముల్కినాడు]] చెందినదని చెప్పవచ్చు.
 
== ఇవి కూడా చూడండి ==
#[[అద్వైతం]]
#[[కులాలు]]
 
[[వర్గం:తెలుగు ప్రాంతాలు]][[వర్గం:తెలుగు చరిత్ర]][[వర్గం:ఆంధ్ర చరిత్ర]][[వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర]][[వర్గం:తెలుగు నాడులు]]
 
==మూలాలు==