"ముహమ్మద్ బిన్ తుగ్లక్" కూర్పుల మధ్య తేడాలు

ముహమ్మద్ బిన్ తుగ్లక్, నాణెముల ప్రయోగాలకు ప్రసిద్ధి. బంగారు మరియు వెండి నాణేలకు బదులుగా రాగి మరియు ఇత్తడి నాణేలను విడుదల చేశాడు. దీనిలోగల లొసుగులు తెలిసిన ప్రజలు, బంగారు మరియు వెండి నాణేలు తమదగ్గరే వుంచుకొని, రాగి, ఇత్తడి నాణేలు స్వంతంగా తయారుచేసుకొని, చెలామణీ చేసుకోసాగారు. దీనివలన సుల్తాను ఖజానాకు గండి పడింది. ఈ నాణేలపై లిపీకళాకృతులూ నాణ్యవంతముగా లేనందున దొంగచాటుగా నాణేలు తయారుచేసేవారికి తమపని సులభతరమైనది. ఈ విధానము విజయవంతము కాకపోయిననూ, నాణెములు మరియు మారక విధానము పటిష్ఠమైనది. ఇతనికి చరిత్రలో మంచిపేరే తెచ్చి పెట్టింది. ఇతని బంగారు [[దీనారు]] లో 202 గింజల (గురుగింజ) బరువూ, 172 గింజల బరువులూ గలవు. వెండి నాణెంలో 144 గురుగింజల బరువూ తూగేవి. ఏడేండ్ల తరువాత, ఈ విధానాన్ని రద్దు పరచాడు, కారణం ప్రజలనుండి సరైన సహకారం లభించక పోవడమే.
 
ఇతని నాణెములపై [[షహాద|కలిమా]] ముద్రించివుండేది. ఇదేగాక, ''అల్లాహ్ మార్గంలో యోధుడు'' అనీ, నలుగురు [[రాషిదూన్ ఖలీఫాలు]] అయిన [[అబూబక్ర్]], [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్|ఉమర్]], [[ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్|ఉస్మాన్]] మరియు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]] ల పేర్లు ముద్రింపబడి యుండేవి. తన నాణేలను, [[ఢిల్లీ]], [[లక్నో]], [[దారుల్ ఇస్లాం]], [[సుల్తాన్ పూర్ (వరంగల్)|సుల్తాన్ పూర్]], [[తుగ్లక్ పూర్ (తిర్హూట్)|తుగ్లక్ పూర్]], [[దౌలతాబాదు]], మరియు [[ముల్క్-ఎ-తిలంగ్]] (తెలంగాణా) లలో ముద్రించేవాడు. ఇంతవరకూ 30 రకాల బిల్లన్ నాణేల గూర్చి తెలిసింది.
 
==ప్రసిద్ధ మూలాలు==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/294544" నుండి వెలికితీశారు