వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 776:
 
==మూలాలు==
 
== వికీపీడియా విధి విధానాలపై పున:సమీక్ష ==
 
ఇటీవలి నిర్వహకులపై జరుగుతున్న చర్చలు గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది. ఏవైనా నిర్ణయాలపై చర్చలు జరుతున్నపుడు వాటిలో పాల్గొనని వాడుకరులు తరువాత ఆ నిర్ణయాలను అమలుచేస్తున్నపుడు విమర్శలు, వాదనలు చేయడం. కారణాలు ఏవైనా ఒక నిర్ణయాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించి అమలుచేస్తున్నపుడు అంగీకరించని సభ్యులు తప్పుకోవడం, లేదా వికీకి దూరమవడం జరగొచ్చు. అది కొందరి సభ్యులకు నచ్చకపోవడం వలన మళ్ళీ వాటిపై చర్చలు జరగడం ఇది ఒక నిరంతర ప్రక్రియలా ఉన్నది. కొన్ని పాలసీలను రూపొందించుకున్నాక లేదా ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలుచేస్తున్నవారిపై కోపం ఎందుకు రావాలి. అది వారి వ్యక్తిగత నిర్ణయాధికారం కాదు. బలవంతంగా అమలుచేయడానికి. దాన్ని ఎవరైనా అంగీకరించి వారికి సహకరించవాల్సిందే. [[వాడుకరి:దేవుడు|దేవుడు]]గారు చర్చ తీసింది వికీపీడియాపై విమర్శలు అని. కాని ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న '''నిర్వహకుల తీరు తాము చెప్పిందే వేదం, తాము చెప్పినట్టే వికీపీడియాలో రచనలు ఉండాలి వంటి పలు ఆరోపణలు చేసారు.''' కాని ఆరోపణలు చేసేముందు వాటిపై కొన్ని ఉదాహరణలు అందించి ఉండవలసింది. ముఖ్యంగా '''వాడుకరులకి ఆపాదించే నియమాలు, తప్పొప్పులు నిర్వహకులకి కూడా వర్తించినప్పటికి అవి నిర్వాహకులు ఒప్పుకోకపోవడం. ''' అనేదానిపై. ఎక్కడ ఎలా, ఎందుకు ఒప్పుకోలేదు అనేవి కొన్ని ఉదాహరణలు ఇస్తే బావుందేది. తెలుగు వికీలో నిలకడగా రచనలుచేసే వాడూకరులే తక్కువ. వాళ్ళలో ఎక్కువ మంది నిర్వహకులుగానే ఉన్నారు. నిర్వహకులుగా ఉన్నవారు చెప్తే అది అధికారంగా అనిపించడం బహుశా వాడుకరి రచన మీద వారు దిద్దుబాట్లు చేయడం నచ్చకపోవడం వలన అయిఉంటుంది. లేదా మరొకటి, కారణం ఏదైనా అలాంటి అభిప్రాయాలు ఎక్కువ మంది సభ్యుల్లో ఉంటే విధి విధానాలను సవరించడానికి మొదట దీనిపై ఒక చర్చమొదలుపెట్టడం అవసరం. ఆరోపణలు, విమర్శలు లేదా సలహాలు ఇచ్చే అందరూ దీన్లో పాల్గొనాలి. స్పష్టమైన విధి విధానాలను, ముఖ్యంగా రచనల తొలగింపు, కొత్త వాడుకరుల రచనలపై ఆంక్షలు, కొత్త వాడుకరులతో చర్చల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, వివాస్పదమైయ్యే అంశాలపై ఓటింగ్ నిర్ణయాలువంటి మరిన్ని అంశాలపై పాలసీలు రూపొందించుకున్నాక వికీ శుద్ది లేదా కొత్త వ్యాసాలు వంటి వాటిపై పనిచేయడం మంచిదని నా అభిప్రాయం...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 16:42, 29 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు