"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

చి
# "ప్రసాద్ గారిపై చర్య తీసుకొనే ముందు నాకు 2 సార్లు మెయిళ్ళు పంపి చర్చలోకి లాగిన సంగతి గుర్తుందా!" అని అన్నారు. మీ అబద్ధాలకు హద్దూ ఆపూ లేదా రావు గారూ!! ఆ ఈమెయిలు చర్చలో ఉన్నది ఇది:
## మొదట నేను రాసినది (ఒకే లైను): '''నమస్కారం రావుగారూ, బాగున్నారని తలుస్తాను. చాన్నాళ్ళైంది మిమ్మల్ని వికీలో చూసి. సెలవు ఎప్పటి వరకూ తీసుకుంటున్నార్సార్?'''
## దానికి మీ సమాధానం (పేర్లు చెప్పకుండా తోటి వాడుకరులను విమర్శిస్తూ ఒక పేరా): '''నమస్కారములు చదువరి గారు,''' '''తెవికీలో కొందరు సభ్యులు నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం, పలుమార్లు చెప్పిచూసిననూ వారి ప్రవర్తనను ఏ మాత్రం సరిదిద్దుకోకపోవడం, బాటు/AWB ద్వారా చేసే పనికి కూడా ఉద్దేశ్యపూర్వకంగా చిన్న మరియు సునాయాస దిదుబాట్ల ద్వారా ఇతరులను చికాకు పర్చడం, తెవికీలో సమాచారం చేర్చడానికి ఎన్ని అవకాశాలున్ననూ కేవలం అనవసర మార్పులు చేర్పులతో (కొందరు అనవసర వర్గాలు, మూసలు, ఖాళీ విభాగాలు,   చేరిస్తే మరికొందరు వాటిని తొలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రామవ్యాసాలలో) దిద్దుబాట్ల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నించడం, ఇదివరకు నేను చురుకుగా ఉన్న సందర్భాలలో పలు పర్యాయాలు ఎన్ని సూచనలు చేసిననూ తోటి సభ్యుల నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు లేకపోవడం తదితర కారణాలవల్ల విరక్తి చెంది తాత్కాలికంగా దూరంగా ఉన్నాను. మనకు సభ్యుల కంటే వ్యవస్థ ముఖ్యం కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ చురుకుగా ప్రవర్తిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ఆ రోజు త్వరలోనే వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను.'''
## దానికి నా సమాధానం (మళ్ళీ ఒకే లైను): '''తెవికీ అభివృద్ధికి మీవంటి వారి అవసరం ఎంతో ఉంది. మీరు మళ్ళీ తెవికీలో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఉంటానండి'''
 
 
అబద్ధాలు చెప్పో అసత్యాలు చెప్పో నన్ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు మీరు. ఇక మీతో వాదించి ఇక నా సమయాన్ని వృథా చేసుకోదలచుకోలేదు, చేసుకోను. మీ శక్తియుక్తులను వికీకి పనికొచ్చే పనులకు వాడుతారని ఆశిస్తూ, వాడమని కోరుతూ.. సెలవ్. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:55, 28 మే 2020 (UTC)
===దేవుడు ఎవరు===
అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పని చేయటం మాని చాలాకాలం అయ్యింది. నేను https://www.smule.com/JVRKPRASAD నందు అప్పటి నుంచి పాటలు పాడుకుంటూ ఉన్నాను. సామాజిక సైట్స్ నందు కూడా నా హాజరు తగ్గించుకున్నాను. ఈరోజు వరకు నామీద కొంతమంది సభ్యులకు సదభిప్రాయం లేదు. ఆ కారణాలు వారికే తెలియాలి. ఈరకంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. నన్ను అనవసరంగా అంటే నేను అంటాను అని చాలా మందికి అనుభవమే. నన్ను అన్న వ్యక్తులే సాక్ పప్పెట్లు కాదా అని ఆలోచించాలి. ఆ "దేవుడు" అనే మాయమనిషి నాకు కూడా మంచి మాటలు, పొగడటం ఇది వరకు జరిగింది. మంచి మాటాలతో మాయగాళ్ళు బయటకు రారు. అడ్డమైన మాటలంటే ఎవరో బయట పడతారు. ఎవరైనా ఆపని చేయండి. మీరు చెయ్యనంటే నేను బండబూతులు తిడతాను. ఆ మనిషి బయటకు వస్తాడు, లేదా మళ్ళీ ఇక్కడకు ఆ పేరుతో రాడు. అంతేకాని, నామేద పిచ్చి రాతలు వ్రాయవద్దు. నేను మరోపేరుతో ఇక్కడకు వచ్చి వ్రాయావలసిన దరిద్రం, నాకు లేదు. ఏదైనా ఎంత పెంటైనా వ్రాయాలనుకుంటే నాపేరుతోనే వ్రాస్తాను. ముందు వాడుకరులు అది తెలుసుకుంటే మంచిది. ఇక దొంగరాతగాళ్ళు ఎవరో (ఎవడో) బయట పెట్టండి. నన్ను కెలికిన వారి మీద చర్యలకు, నిర్వాహక, అధికారులు నాకు మీ సమాధానం ఇవ్వండి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:22, 30 మే 2020 (UTC)
 
== వికీపీడియాపై విమర్శలు ==
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2947934" నుండి వెలికితీశారు