"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

[[User:K.Venkataramana|వెంకట రమణ]] గారు, అన్నీ వివరంగా చెబుతాను. దయచేసి కొంచెం ఓపిక కలిగి ఉండండి. __[[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 04:46, 30 మే 2020 (UTC)
* ఈ చర్చలన్నీ ప్రారంభం కాక ముందే ఒక [[వికీపీడియా:రచ్చబండ#తెవికీలో ఒక సమీక్షా సంఘం|ఒక సమీక్షా సంఘం]] ఏర్పాటుచేయడానికి ఒకానొక నిర్వాహకులు చొరవ తీసుకుని ప్రతిపాదించడం, దాన్ని బలంగా తొమ్మిది మంది సమర్థించడం చూస్తే - నిర్వాహకులు అసలు ఆ ప్రశ్న ఉత్పన్నం కావడానికి ముందే నిర్వాహకులు పబ్లిక్ స్క్రూటినీకి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి, ఈ దిశగా ఆ సమీక్షా సంఘం ఏర్పాటును మించిన కార్యాచరణ మరొకటి ఉండబోదని నా అభిప్రాయం [[వాడుకరి:B.K.Viswanadh|విశ్వనాథ్ గారూ]]. అసలు అది అలా ఉంచండి, చురుకుగా ఉన్న నిర్వాహకులే ఒక సమీక్షా సంఘాన్ని ప్రతిపాదించి, బలంగా సమర్థించడాన్ని మించిన ఆరోగ్య సూచిక మరేదీ లేదు. ఇటువంటి ప్రయత్నం భారతీయ భాషల వికీపీడియాల్లో జరగగా నేను చూడలేదు, పైగా ఆంగ్లంలో ఉన్న ఆర్బిట్రేషన్ కమిటీని మించిన నిష్పాక్షికత దీని ప్రాతిపదికలోనే ఉండడం గొప్ప విశేషం. ఇటువంటి ప్రతిపాదన చూసి కూడా తాము రాస్తున్న వాటిలో దీన్ని గురించి ప్రస్తావించకుండా కేవలం విమర్శలే చేస్తూ, నిర్వాహకుల చిత్తశుద్ధిని గ్రహించనివారి అభిప్రాయాలను కూడా సహనంతో చర్చించడాన్ని మించి సర్టిఫికెట్ ఈ సముదాయ ఆరోగ్యానికి ఏమీ అక్కరలేదు. ఈ గుణాన్ని మనం ఆభరణంగా ధరిస్తూనే మనం తలపెట్టే "గట్టి మేల్" తలపెడుతూనే పోవాలని నా అభిప్రాయం. ఇదండీ నిర్మొహమాటంగా నా అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను మనం చేయాల్సినదల్లా సమీక్షా సంఘం పని శాశ్వతంగా నిలిచిపోయే కృషి అని గుర్తించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:16, 30 మే 2020 (UTC)
 
== మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా ==
 
మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా అని అనుమానం వాడుకరులకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వాడుకరిని అధికారంలో ఉన్న మనిషి, మంచిగానైనా లేదా చెడుగానైనా ఏవిధంగానైనా పాతచర్చలు ఉదహరిస్తూ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి. అమ్మ ఒళ్ళో కూర్చుని పాలు తాగే వయసు నుండి చనిపోయే వరకు మనిషి ఒకేలా వుంటాడా ? తప్పులు ఎంచే మీరు మాత్రం మంచివారు, మీకు నచ్చని వారు చెడ్డవారు అనటం, జీవితకాలం ముద్ర వేయడం ఏమాత్రం సహించరాని విషయం. ఈ పెడ ధోరణి ఇప్పట్లో ఆగేటట్లు లేదు. అందుకే ఇక్కడకు నేను రావడం మానేసాను. ఎవరికీ ఊడేది యేమీలేదు కదా. ఇక్కడ పద్దతులు మారే వరకు, మంచి మనసులు ఉన్నవారు మాత్రం ఇక్కడకు రావద్దు, ఉండొద్దు, పని చేయవద్దు మాటలు అనిపించికోవద్దు, మీ సమయం వృధా చేసుకోవద్దని నా సలహా, సూచన. నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇక్కడ నా మనసుకు బావుంది అని అనిపిస్తే పనిచేయమని నేనే పోస్ట్ పెడతాను. నాకు తప్పులు ఇక్కడ అనిపించినవి వ్రాస్తునే ఉంటాను. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:46, 30 మే 2020 (UTC)
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2947957" నుండి వెలికితీశారు