వెలుదండ నిత్యానందరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1962]], [[ఆగష్టు 9]]వ తేదీన [[నాగర్‌కర్నూల్ జిల్లా]] మంగునూరులో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి [[వెలుదండ రామేశ్వరరావు]] కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్‌ టైమ్‌ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగాడు.
డిగ్రీ స్థాయిలో రంగాచార్యులు, [[కపిలవాయి లింగమూర్తి]] మొదలైనవారు, పి.జి. స్థాయిలో [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నా.రె]], [[ఎల్లూరి శివారెడ్డి]], [[ఆచార్య ఎస్వీ రామారావు|ఎస్వీ రామారావు]] మొదలైనవారు ఇతని గురువులు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, ఆచార్యుడుగా, అన్నింటికీ మించి మాహావ్యాసకారుడుగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు.