సంధ్య (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== జీవిత విశేషాలు ==
ఆమె అసలు పేరు "వేదవల్లి". సంధ్య పేరుతో సినిమా నటిగా వెలుగొంందింది. ఆమె భర్త జయరామన్ మరణించేనాటికి జయలలిత వయస్సు రెండేళ్ళు<ref>{{Cite web|url=https://yourstory.com/telugu/99944fb1fb-she-left-an-indelible-signature-in-politics|title=రాజకీయాల్లో జయలలిత చెరగని సంతకం|last=telugu|first=team ys|date=2016-12-05|website=YourStory.com|language=te|access-date=2020-06-04}}</ref>. ఆమె భర్త జయరామన్ లాయరుగా పని చేసేవాడు.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/tv/news/tamil-nadu-ex-chief-minister-and-actress-jayalalitha-birth-place-and-history/articleshow/72837840.cms|title=కన్నడ నాట జన్మించి.. మెట్రిక్యులేషన్‌లో స్టేట్ టాపర్.. జయలలిత తొలి అడుగులు..|website=Samayam Telugu|language=te|access-date=2020-06-04}}</ref> జయరామన్ మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురితో సహా చేరింది వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టింది. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి దగ్గరికి వేదవల్లి వెళ్ళింది. దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగింది. చిన్నారి జయను వదిలి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేసింది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/national/cm-jayalalithaa-life-story-429508|title=శక్తి స్వరూపిణి|date=2016-12-06|website=Sakshi|language=te|access-date=2020-06-04}}</ref> కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళింది. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టేది<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/national/cine-jayanmata-429499|title=సినీ జయన్మాత|date=2016-12-06|website=Sakshi|language=te|access-date=2020-06-04}}</ref>.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సంధ్య_(నటి)" నుండి వెలికితీశారు