శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (14), typos fixed: దక్షిన → దక్షిణ, బడినది. → బడింది. (3), చినారు → చారు (4), ఉన్నవి. → ఉన్నాయి. (6),
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
== మతమూశిల్పమూ ==
అంతర్జాతీయంగా అనేక విషయాలకు చెందిన ప్రముఖులు శిల్ప కళలో చోటుచేసుకున్నా భారతదేశంలో మాత్రం పురాణదృశ్యాలు, దేవతలూ, రాజకుటుంబాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. నవీనకాలంలో రాజుల స్థానంలో రాజకీయ నాయకులు, [[కవులు]] పలురంగాలలో ప్రముఖులు శిల్పాలలో చోటు చేసుకోవడం విశేషం. చెన్నైలో సముద్ర తీరంలో స్థాపించిన ఉళైప్పాళీ (శ్రమజీవి) శిల్పం అధినిక శిల్పసైలికి ఒక ఉదాహరణ. దక్షిణ భారతంలో ఆలయశిల్పాలే అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడి శిల్పాలు అనేకంగా నల్లరాతితో చేయడం విశేషం. హిందూ సంప్రదాయంలో విగ్రహారాదనకు ప్రాధాన్యం అధికం కనుక ఆలయాలలో శిల్పకళకూ అత్యంత ప్రాధాన్యత నిస్తాయి. ఆలయ కుడ్యాలు, ఆలయ స్తంభాలు, ఆలయ గోపురాలు, పైకప్పు కూడా చెక్కిన రాతిబొమ్మలతో అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ గర్బగుడిలో ఉన్న ప్రధాన దేవత యొక్క పురాణదృశ్యాలతో నిండి ఆనాటి కథలను చెప్తుంటాయి.
 
==కళాత్మకత==
[[శిల్పకళ|శిల్ప కళ]]లో లేని విద్యలేదు. గతంలో శిల్పుల చేతిలో శిలలు వెన్న ముద్దలుగా మారాయి. ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం. సకల విద్యలు తెలిసిన వారే శిల్పులుగా రాణించ గలరు. లెక్కప్రకారం కొలతలు వేసి ఏ శిల్పానికి ఎంత పరిమాణం శిల కావాలో తెలియాలంటే [[గణిత శాస్త్రం]] తప్పక తెలిసి ఉండాలి. శిల్పాలు ఎక్కువగా నాట్యభంగిమలో ఉంటాయి. నాట్యశాస్త్రం తెలియని శిల్పులు, శిల్పంలోని హావ భావాలను కచ్చితంగా ప్రతిబింబించలేరు. చిత్ర కళ తెలియనిదే [[శిల్పకళ]] ప్రారంభించలేరు. శిలపై ముందుగా చిత్రాన్ని గీసి తర్వాతనే శిల్పంగా మారుస్తారు. ఇలా అన్ని శాస్త్రాలలో నిష్ణాతులైన వారే గొప్ప శిల్పులుగా రాణిస్తారు. గతంలో ఇలాంటి శిల్పులు కోకొల్లలుగా ఉండేవారు. అందుకే ఏ [[దేవాలయం]] చూసినా శిల్పకళా శోభితమైనదే. హిందూ దేవాలయాలలో వివిధ విధాలుగా శిల్పాలను చేక్కుతారు. అందులోశిల్పకళా స్తంభాలు, శిల్పకళా మండపాలు, నాట్య శిల్పాలు, దేవతా మూర్తులు, పశు, పక్ష్యాదులు, లతలు, తీగలు, [[వృక్షాలు]], శృంగార శిల్పాలు, గోపురాలలో శిల్పకళ, గోడలపై శిల్పకళ వంటివి ముఖ్యమైనవి.
 
== ఆలయాలు శిల్పాలు ==
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు