యునానీ: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: ur:طب یونانی
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యునానీ''' (Unani) అన్న మాట "అయోనియా" అన్న [[గ్రీకు]] మాట లోంచి వచ్చింది. అయోనియా గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు [[హకీమ్ బిన్ సేనా]]. [[హకీం]] అంటేనే [[వైద్యుడు]]. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ [[భారతదేశం]] లో బహుళ ప్రచారంలో ఉంది.
గ్రీస్ దేశాన్ని సెంట్రల్ ఆసియా లోని ఇతర ప్రాంతాలన్ని 'యునాన్' అని పిలిచేవి.ఈ వైద్య ప్రక్రియ గ్రీస్ లో మొదలైంది కాబట్టి దీన్ని యునాని వైద్యం అనేవాళ్ళు.మాయలూ,మంత్రాల నుండి వైద్యాన్ని వేరు చేసి ఒక శాస్త్రంగా చెప్పిన 'హిప్పొక్రెటస్'(క్రీ.పూ377-460)ఈ యునాని వైద్య ప్రక్రియకు పితామహుడు.ఈ వైద్య ప్రక్రియను ఈజిప్టు,సిరియా,ఇరాక్,పర్షియా,భారత్,చైనా దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలు జోడించి మరింత సుసంపన్నం చేసాక,అరబ్బులు ప్రత్యేకంగా దీన్ని అభివ్రుద్ది చేసారు.అందువల్ల దీన్ని గ్రీకో-అరబ్ మెడిసిన్ అంటారు.ఈవైద్య ప్రక్రియ భారత్ కు వచ్చాక ఇక్కడి రాజవంశస్తులు అయిన ఖిల్జీలు,తుగ్లక్లు,మొఘల్ చక్రవర్తులూ ఆదరించారు.రజ వంశాల ఆదరణ తో 17 వ శతాబ్ధం వరకూ యునానీ వైద్యం అభివ్రుద్ది చెందినా ,బ్రిటిష్ వారి పాలన లో దీనికి పూర్తిగా ఆధరణ తక్కువయింది.
==సిద్ధాంతాలు==
మనిషిలో నాలుగు విధాలైన ద్రవాలుంటాయి.ఖూన్(రక్తం),బల్గం(తెమడ),సఫ్రా(ఎల్లో బైల్),సౌదా(బ్లాక్ బైల్).ఈ నాలుగు రకాల ద్రవాల మధ్య సమన్వయం ఉంటె మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లేనని యునాని వైద్యం చెబుతుంది.ఈ నాలుగు ద్రవాలను హ్యూమర్స్ అంటారు కాబట్టి దీన్ని హ్యూమరల్ థియరీ అంటారు.పై నాలుగు ద్రవాలు సమన్వయంగా ఉండటానికి ఓ శక్తి(వైటల్ ఫోర్స్) తోడ్పడుతుంది.శరీరానికి అవసరపడే ఆ శక్తిని ఖువ్వతే ముదబ్బిరే బదన్ అంటారు.ఈ శక్తి కి విఘాతం కలిగినా మనిషిలో హ్యూమరల్ ద్రవాల సమన్వయం దెబ్బతిన్నా,ఆ వ్యక్తికి జబ్బు వస్తుంది.ఇక్కడ మరో సిద్దాంతము కూడా ఉంది.మనిషిలోని ఈ నాలుగు ద్రవాలకు వేరు వేరు స్వభావాలుంటాయి.రక్తం వేడిగా ఉంటుంది,తెమడ చల్లగా ఉంటుంది,సఫ్రా(పైత్య రసం)వేడిగా పోడిగా ఉంటుంది,సౌదా(బ్లాక్ బైల్)చల్లగా ఉంటుంది.ఈద్రవాల స్వభావాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలు వేరుగా ఉంటాయి.దాన్ని బట్టే సైనసైటిస్,న్యుమోనియా వంటి చల్లటి స్వభావం గల జబ్బులు,మూల శంక ,టైఫాయిడ్ వంటి వేడి స్వభావమున్న జబ్బులు వస్తాయి.ఈ సిద్ధాంతాన్ని టెంపర్మేంట్ థియరీ అంటారు.'హ్యూమరల్ థియరీ','ఇమ్మ్యునిటీ థియరీ','టెంపర్ మెంటల్ థియరీ'ఆధారంగా జబ్బు లక్షణాలపై వ్యతిరేకంగా పనిచేసి రోగాన్ని మూలాలనుండి పెరికి వేస్తుందీ 'యునానీ వైద్యం' అంటారు .
==వ్యాధి నిర్ధారణ==
యునానీ వైద్యంలో ప్రధానంగా నాడీ(నఫ్జ్) చూసి వ్యాధి నిర్ధారణ చేస్తారు.ఆ తరువాత మూత్ర పరీక్ష(బవుల్),మల పరీక్ష(బరాజ్).రకరకాలైన యంత్ర పరీక్ష్లు లేకుండా కేవలం నాడీ,మూత్ర,మల పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.
==చికిత్స విధానాలు==
యునానీ వైద్యంలో నాలుగు రకాలుగా చికిత్స చేస్తారు.మొదటిది:(ఇలాజ్ బిద్ తద్బీర్) ,అంటే ఎలాంటీ మందులు ఇవ్వకుండా కేవలం భౌతిక పరిస్థితుల మార్పు ద్వారా వైద్యం చేయడం.
రండవ రకం:(ఇలాజ్ బిల్ గిజ్జా)ఇది ఆహారం తో చేస్తారు.
మూడవ రకం:మందులతో వైద్యంచేస్తారు.ఈ మందుల తయారీ లో వనమూలికలు,జంతువుల నుండి సేకరించిన పధార్థాలు.ఖనిజాలు ఉపయోగిస్తారు.
నాలుగో రకం:(ఇలాజ్ బిల్ జరాహత్)అవసరమైనప్పుడు శస్త్ర చికిత్స.యునానీ లో శస్త్ర చికిత్స ప్రవేశ పెట్టింది 'రేజస్"కాబట్టి ఆయన్ను ఫాదర్ ఆఫ్ సర్జరీ గా అభివర్ణిస్తారు.
 
{{వైద్య శాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/యునానీ" నుండి వెలికితీశారు