ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
''ఎమ్. ఎస్. నారాయణ'' ([[ఏప్రిల్ 16]], [[1951]] - [[జనవరి 23]], [[2015]]) గా పిలువబడే '''మైలవరపు సూర్యనారాయణ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] హాస్యనటుడు, దర్శకుడు. వీరు ఇంతవరకు దాదాపు 700 <ref name="ఎంఎస్ నారాయణ ఇకలేరు.. ">{{cite web |url= http://www.sakshi.com/news/movies/ms-narayana-no-more-206100|title="ఎంఎస్ నారాయణ ఇకలేరు.."|date= 23 జనవరి 2015|website= www.sakshi.com|publisher=[[సాక్షి]] |accessdate=23 జనవరి 2015}}</ref> చిత్రాలలో నటించారు. [[కొడుకు]], [[భజంత్రీలు]] చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడుపేరొందాడు.
 
==నేపథ్యం==
గతంలో ఈయన [[భీమవరం]]లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[కృష్ణంరాజు]] నటించిన [[మా నాన్నకు పెళ్ళి]] చిత్రం ద్వారా [[తెలుగు]] చలన చిత్రచలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం [[వేగుచుక్క పగటిచుక్క]].<ref name="...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|first1=ఎడిటోరియల్|title=...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు|url=http://www.andhrajyothy.com/artical?SID=80336&SupID=26|accessdate=27 February 2018|publisher=తోటపల్లి మధు}}</ref>
 
==వ్యక్తిగత జీవితము==
పంక్తి 24:
వీరి స్వగ్రామం [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[నిడమర్రు]]. వీరిది మధ్యతరగతి [[రైతు]] కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న [[చిననిండ్రకొలను|పత్తేపురం]]లోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.
 
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్‌ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు. తన క్లాస్‌మెట్‌ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్ళి చేయించడం విశేషం.
 
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం [[కొడుకు]] చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
 
సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు. తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు.అంతలోనే 2015 లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
 
== నాటకాలు ==
పంక్తి 34:
 
== సినీ ప్రస్థానము ==
1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవి రాజరవిరాజా పినిశెట్టితో రుక్మిణీ సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా [[ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.]] అవకాశం కల్పించారు. [[పుణ్యభూమి నాదేశం]], [[రుక్మిణి (సినిమా)]] చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో [[మా నాన్నకు పెళ్ళి]] సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.<ref name="MS Narayana Article in Andhra jyothy2"/>
 
==పేరు పడ్డ సంభాషణలు==
పంక్తి 44:
 
==తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు==
ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు ( రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా [[ఫిల్మ్‌ఫేర్]] అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
 
== చలన చిత్ర ప్రస్థానము==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._నారాయణ" నుండి వెలికితీశారు