బాబు బంగారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== కథా నేపథ్యం ==
కృష్ణ(వెంకటేష్) జాలి గల పోలీస్ ఆఫీసర్. తన వల్ల నేరం చేసే వాళ్ళు కూడా బాధ పడకూడదని ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి కష్టాల్లో ఉన్న శైలజ(నయనతార) అనే అమ్మాయి తారస పడుతుంది. తన కన్నీళ్లు చూసి చలించిపోయిన కృష్ణ తనకు సహాయం చేయాలని భావిస్తాడు. మొదటి చూపులోనే తనను ఇష్టపడతాడు కూడా. శైలజ బావ బాబ్జీ(పృద్వి) ద్వారా తన కుటుంబానికి దగ్గరవుతాడు. శైలజకు ఉన్న ఒక్కో సమస్యను తీరుస్తూ.. తనను సంతోషంగా చూసుకుంటాడు కృష్ణ. ఇది ఇలా ఉండగా శైలజ తండ్రి శాస్త్రి(రాధారవి) ఓ కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో శాస్త్రిని చంపడానికి మల్లేశ్ యాదవ్(సంపత్) ప్రయత్నిస్తుంటాడు. ఎమ్మెల్యే పుచ్చయ్య(పోసాని కృష్ణమురళి) మల్లేశ్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఇంతకీ శైలజ తండ్రిని మల్లేశ్ యాదవ్ ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు..? శాస్త్రి నిజంగానే నేరస్తుడా..? కృష్ణ కావాలనే శైలజ కుటుంబానికి దగ్గరయ్యడా..? కృష్ణే, శాస్త్రిని అరెస్ట్ చేశాడా..? అతను చేసిన నేరం ఏమిటి..? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.<ref name="‘‘బాబు బంగారం’’ మూవీ రివ్యూ">{{cite web |last1=తెలుగు సమయం |first1=సినిమా రివ్యూ |title=‘‘బాబు బంగారం’’ మూవీ రివ్యూ |url=https://telugu.samayam.com/telugu-movies/movie-review/babu-bangaram-movie-review/moviereview/53666059.cms |website=www.samayamtelugu.co |accessdate=9 June 2020 |date=12 August 2016}}</ref><ref name="బాబు బంగారం – సరదాగా చూడొచ్చు !">{{cite web |last1=123 తెలుగు |first1=సమీక్ష |title=బాబు బంగారం – సరదాగా చూడొచ్చు ! |url=https://www.123telugu.com/telugu/reviews/babu-bangaram-movie-review-in-telugu.html |website=www.123telugu.com |accessdate=9 June 2020 |date=13 August 2016}}</ref>
 
==నటులు==
"https://te.wikipedia.org/wiki/బాబు_బంగారం" నుండి వెలికితీశారు