కనకదుర్గ పూజామహిమ (1960 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పరిచయం ఒక లైను
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
'''కనకదుర్గ పూజా మహిమ''' 1960లో బి. విఠలాచార్య నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన జానపదకథా చిత్రం. ఇందులో కాంతారావు, కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు.
==సాంకేతికవర్గం==
* కథ: బి.విఠలాచార్య
* మాటలు, పాటలు: జి కృష్ణమూర్తి
* సంగీతం: రాజన్ నాగేంద్ర
* కళ: బి.సి.బాలు
* ఛాయాగ్రహణం: జి.చందు
* కోడైరెక్టర్, ఎడిటర్: జి.విశ్వనాథం
* నృత్యం: వి.జె.శర్మ
* స్టంట్స్: పరమశివం
* నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య
==నటీనటులు==
* [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] - మాధవుడు
* [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]] - మాలతి
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]] - మహారాజు
* ఆదోని లక్ష్మి - రాణి
* [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] - నరేంద్రవర్మ
* [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]] - మేఘనాథుడు
* [[వల్లూరి బాలకృష్ణ]] - త్రిలోకం
* [[వడ్లమాని విశ్వనాథం]] - పురోహితుడు
* [[కైకాల సత్యనారాయణ]] - మార్తాండవర్మ
* [[మీనాకుమారి (నటి)|మీనాకుమారి]]
* స్వర్ణలత
* మాధురి
 
==కథ==
మణిశిలా దేశానికి మహరాజు మిక్కిలినేని. ఆయన పట్టపురాణి పన్నెండేళ్ల తరువాత గర్భం దాలుస్తుంది. ఆమెతో అంతఃపురంలో వీణాగానంతో పరవశిస్తుంటాడు. ఆస్థాన పురోహితుడు కనకదుర్గాదేవి పూజకు రమ్మని ప్రభువును కోరగా, తిరస్కరిస్తాడు. పూజారినే పూజలు నిర్వహించమని ఆదేశిస్తాడు. దేవికి ఆగ్రహం కలుగుతుందని మహారాణి చింతిస్తుంది. ఆపైన మహరాజు, మహారాణితో వేసిన పందెం కారణంగా -ఆమె అంతఃపురం వదలి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. కొద్ది రోజులకు పశ్చాత్తాపంతో మహరాజు రాజ్యభారాన్ని బావమరిది నరేంద్రవర్మకు అప్పగించి అడవులకు వెళ్తాడు. అడవిలో మహరాణి మగబిడ్డను ప్రసవించి, మునిశాపం కారణంగా భల్లూకంగా మారుతుంది. రాణి బిడ్డను సంతానం లేని కనకదుర్గాదేవి భక్తులైన దంపతులు చేరదీసి పెంచుకుంటారు. మాధవుడని పేరు పెడతారు.
భార్యను వెతుకుతూ వచ్చిన మహరాజు గాయపడి భల్లూక సాయంతో సేదదీరి అడవిలో జీవిస్తుంటాడు. నరేంద్రవర్మ కుమార్తె మాలతిని మాధవుడు ఓ ఆపదనుంచి కాపాడటంతో వారిరువురి నడుమ అనురాగం అంకురిస్తుంది. మేఘనాథుడు సర్వతాంత్రిక విద్యలు నేర్చి, తనకు విద్యనేర్పిన గురువునే బంధిస్తాడు. ఇంకా సర్వజ్ఞత సిద్ధించటంకోసం మణిశిలా దేశం ప్రవేశించి, నరేంద్రవర్మ అభిమానం పొంది రాజమందిరం చేరతాడు. అతన్ని ఎదిరించ మాధవుడు భంగపడి ఓ ఏడాది గడువులో అతన్ని ఓడిస్తానని శపథం చేస్తాడు.
మాయవతి అనే కన్యను వశపరచుకొన్న మేఘనాధుడు, ఆమెను పాముగా మార్చి రాజ్యంలోని ముఖ్యులను పాము కాటుతో అంతం చేయిస్తూ ఆ నేరం రాకుమారి మాలతిపై మోపి, ఆమెను రాజ్యంనుంచి వెళ్లగొట్టిస్తాడు. మాధవుడు, తన సోదరుడు త్రిలోకం సాయంతో మేఘనాధుని గుహకు చేరి, గురువు ద్వారా విద్యలను గ్రహించి దేవిని ఉపాసిస్తాడు. నరేంద్రవర్మను బలివ్వటానికి అక్కడకు తీసుకొచ్చిన మేఘనాథుని మాధవుడు ఎదిరించి అతన్ని అంతం చేస్తాడు. కనకదుర్గాదేవి అనుగ్రహంతో అంతా కలుసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 కనకదుర్గ పూజా మహిమ |url=http://www.andhrabhoomi.net/content/flashback50-70 |accessdate=9 June 2020 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=3 August 2019}}</ref>.
==పాటలు==
# అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - [[పి.బి.శ్రీనివాస్]], [[జిక్కి]]
Line 23 ⟶ 50:
# వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం
 
==మూలాలు==
==వనరులు==
{{మూలాలజాబితా}}
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)