కనకదుర్గ పూజామహిమ (1960 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జానపద చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 37:
మణిశిలా దేశానికి మహరాజు మిక్కిలినేని. ఆయన పట్టపురాణి పన్నెండేళ్ల తరువాత గర్భం దాలుస్తుంది. ఆమెతో అంతఃపురంలో వీణాగానంతో పరవశిస్తుంటాడు. ఆస్థాన పురోహితుడు కనకదుర్గాదేవి పూజకు రమ్మని ప్రభువును కోరగా, తిరస్కరిస్తాడు. పూజారినే పూజలు నిర్వహించమని ఆదేశిస్తాడు. దేవికి ఆగ్రహం కలుగుతుందని మహారాణి చింతిస్తుంది. ఆపైన మహరాజు, మహారాణితో వేసిన పందెం కారణంగా -ఆమె అంతఃపురం వదలి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. కొద్ది రోజులకు పశ్చాత్తాపంతో మహరాజు రాజ్యభారాన్ని బావమరిది నరేంద్రవర్మకు అప్పగించి అడవులకు వెళ్తాడు. అడవిలో మహరాణి మగబిడ్డను ప్రసవించి, మునిశాపం కారణంగా భల్లూకంగా మారుతుంది. రాణి బిడ్డను సంతానం లేని కనకదుర్గాదేవి భక్తులైన దంపతులు చేరదీసి పెంచుకుంటారు. మాధవుడని పేరు పెడతారు.
భార్యను వెతుకుతూ వచ్చిన మహరాజు గాయపడి భల్లూక సాయంతో సేదదీరి అడవిలో జీవిస్తుంటాడు. నరేంద్రవర్మ కుమార్తె మాలతిని మాధవుడు ఓ ఆపదనుంచి కాపాడటంతో వారిరువురి నడుమ అనురాగం అంకురిస్తుంది. మేఘనాథుడు సర్వతాంత్రిక విద్యలు నేర్చి, తనకు విద్యనేర్పిన గురువునే బంధిస్తాడు. ఇంకా సర్వజ్ఞత సిద్ధించటంకోసం మణిశిలా దేశం ప్రవేశించి, నరేంద్రవర్మ అభిమానం పొంది రాజమందిరం చేరతాడు. అతన్ని ఎదిరించ మాధవుడు భంగపడి ఓ ఏడాది గడువులో అతన్ని ఓడిస్తానని శపథం చేస్తాడు.
మాయవతి అనే కన్యను వశపరచుకొన్న మేఘనాధుడు, ఆమెను పాముగా మార్చి రాజ్యంలోని ముఖ్యులను పాము కాటుతో అంతం చేయిస్తూ ఆ నేరం రాకుమారి మాలతిపై మోపి, ఆమెను రాజ్యంనుంచి వెళ్లగొట్టిస్తాడు. మాధవుడు, తన సోదరుడు త్రిలోకం సాయంతో మేఘనాధుని గుహకు చేరి, గురువు ద్వారా విద్యలను గ్రహించి దేవిని ఉపాసిస్తాడు. నరేంద్రవర్మను బలివ్వటానికి అక్కడకు తీసుకొచ్చిన మేఘనాథుని మాధవుడు ఎదిరించి అతన్ని అంతం చేస్తాడు. కనకదుర్గాదేవి అనుగ్రహంతో అంతా కలుసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 కనకదుర్గ పూజా మహిమ |url=http://www.andhrabhoomi.net/content/flashback50-70 |accessdate=9 June 2020 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=3 August 2019 |archive-url=https://web.archive.org/web/20190813135715/http://www.andhrabhoomi.net/content/flashback50-70 |archive-date=13 ఆగస్టు 2019 |url-status=live }}</ref>.
==పాటలు==
# అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - [[పి.బి.శ్రీనివాస్]], [[జిక్కి]]