భలే రంగడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
* ఛాయాగ్రహణం: రామకృష్ణ
* కూర్పు: కృష్ణస్వామి
==కథ==
రాజా రాజశేఖరం ఆస్తికి ఏకైక వారసురాలు మనుమరాలు అనురాధ. అదే ఊళ్లో 30 లక్షల ఆస్తి కలిగిన అమ్మాయి తనను వరిస్తుందనే జాతకం భ్రమలో, గుండె ధైర్యంతో హుషారుగా కాలం గడుపుతుంటాడు స్థిరమైన వృత్తిలేని రంగడు. ఒకరోజు అనురాధను సముద్ర ప్రమాదంనుంచి రక్షించి ఆమె అభిమానం పొందుతాడు. రాజశేఖరం ఆస్తి వ్యవహారాలు చూసే దివాన్ తన కుమారుడు పాపాయితో అనురాధ వివాహం జరిపించి ఆస్తి కబళించాలన్న వ్యూహంలో ఉంటాడు. అతని తమ్ముడు శేషు, భీమరాజు వంటి అనుచరులతో అక్రమ వ్యాపారాలు, నేరాలు చేస్తుంటాడు. రాధకు, పాపాయికి పెళ్లి చేయటం కోసం -రాజావారి చేతిలో గుండు దెబ్బకు నౌకరు నర్సయ్య చచ్చిపోయినట్టు నాటకం ఆడించి, రాజావారికి మతిభ్రమించేలా చేస్తాడు దివాన్. రాధతో తన కొడుక్కి పెళ్లి చేయాలని రావికొండలరావు, ఆండాళ్లు, దివాన్.. ఇలా ముగ్గురూ పథకాలు, ప్రయత్నాలు చేస్తుంటారు. రాధ తన అసహాయస్థితిని రంగడికి వివరిస్తుంది. తాతగారి స్నేహితుడి కొడుకుగా రంగడు ఆమె ఇంట ప్రవేశిస్తాడు. రంగడి మేనకోడలు గంగ, రంగడు సాయంతో దుర్మార్గుల కుట్రలనుంచి తాతగారిని రక్షించుకుంటుంది రాధ. కుట్రలను బయటపెట్టి దివాన్, శేషులను పోలీసులకు అప్పగించటం, రంగడు-రాధ, గంగ -పాపాయిల పెళ్లి జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భలే_రంగడు" నుండి వెలికితీశారు