దివ్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''దివ్యవాణి''' తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె [[సర్దార్ కృష్ణమనాయుడు]] చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. [[ఎ.కోదండరామిరెడ్డి]] దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఈమె [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కూతురుగా నటించింది. తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రదర్శకుడు ద్వారకేష్ ఈమె పేరును '''దివ్యవాణి'''గా మార్చాడు.
==జీవిత విశేషాలు==
ఈమె స్వగ్రామం [[తెనాలి]]. ఈమె [[గుంటూరు]]లో పదవ తరగతి వరకు చదువుకుంది.ఈమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. సోదరి బేబీ రాణి నృత్యకళాకారిణి. చిన్నవయసులోనే అంటే 17యేళ్ళ వయసులోనే ఈమెకు దేవానంద్ అనే పారిశ్రామిక వేత్తతో వివాహం జరిగింది. వీరికి కిరణ్ కాంత్ అనే కుమారుడు, తరుణ్యాదేవి అనే కుమార్తె కలిగారు. దివ్యవాణి భర్త యుక్తవయసులోనే మరణించాడు.
 
ఈమె సుమారు 40 తెలుగు సినిమాలలో నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత [[రాధా గోపాళం]] సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించింది. [[వీర]] మొదలైన సినిమాలలో దుష్టపాత్రలలో నటించింది. ఈమె పుత్తడిబొమ్మ (ఈటీవి తెలుగు) వంటి కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది.
 
==దివ్యవాణి నటించిన తెలుగు చిత్రాలు==
*[[సర్దార్ కృష్ణమనాయుడు]] (1987)
"https://te.wikipedia.org/wiki/దివ్యవాణి" నుండి వెలికితీశారు