చర్మము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
== చర్మ సంరక్షణ జాగ్రత్తలు ==
* ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి.
* కొన్ని చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. స్నానం చేయడం, రాత్రిపూట చలి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను, పాదాలను కాపాడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం చేయాలి. విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారం తినాలి. వింటర్ స్కిన్ కేర్ లాంటివి వాడాలి.
* కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
* పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.
* చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
== జంతువుల చర్మం (తోలు) ==
*కొన్ని జంతువుల చర్మంతో [[బట్టలు]], [[సంచులు]] మొదలగునవి తయారుచేస్తారు. వీటికోసం జంతువులను చంపడం చట్టారీత్యా నేరమైనా కోట్లల్లో వ్యాపారం దీనివల్ల జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/చర్మము" నుండి వెలికితీశారు