జై జవాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 34:
* లిల్లీ
==కథ==
దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మాధవరావు కుమారుడు ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రవీంద్రనాథ్, కుమార్తె భారతి. మాధవరావు సోదరి సుందరమ్మ, ఆమె భర్త నరసింహం, మేనకోడలు కస్తూరి. కుస్తూరి బావను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. యుద్ధంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలోవున్న రవీంద్రను నర్సు సుశీల రక్షిస్తుంది. వారిరువురూ ప్రేమించుకుంటారు. రవి స్నేహితుడు డాక్టర్ రఘు మాధవరావు కుటుంబానికి అండగావుంటాడు. అతనికి కాళ్లులేవని తెలిసినా భారతి అతడిని ఇష్టపడుతుంది. ఇంటికి వచ్చిన రవి -రఘు, భారతికి వివాహం జరిపిస్తాడు. తాను సుశీలను వివాహం చేసుకుంటానని తండ్రికి తెలియచేసి, అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో, కారు ఆక్సిడెంట్ సంభవించి సుశీల మరణిస్తుంది. మనోవేదనతో పర్యటనకు వెళ్లిన రవికి సుజాత కనిపిస్తుంది. ఆమె సుశీల చెల్లెలని, వారిరువురినీ శివయ్య, లక్ష్మి దంపతులు పెంచి పెద్ద చేశారని తెలుసుకుంటాడు. అంతేకాదు సుజాతతో వారి కుమారుడు రాముకు చిన్నతనంలో పెళ్లి నిశ్చయమైందని, రాము ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కనుక.. సుజాత -రవిలకు పెళ్లి జరిపిస్తామని చెబుతారు. రవి, సుజాతల పెళ్లి సమయంలో -పాకిస్తాన్‌తో యుద్ధం కారణంగా సైనికులను ప్రభుత్వం వెనక్కి రమ్మని పిలుపునిస్తుంది. ఆ విధంగా తిరిగి యుద్ధానికి వెళ్లిన రవి విజయవంతంగా పోరాటం జరపటం, నమ్మకస్తుడిగా నటిస్తూ దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తి మేనమామ నరసింహం తలపెట్టిన రైలుమార్గాలు, వంతెనల విధ్వంసం కుట్రలను భగ్నం చేస్తాడు. నరసింహం కొడుకు పద్మనాభం భార్య లిల్లీ ఒక సిఐడి ఆఫీసర్. ఆమె కూడా మామ కుట్రను పోలీసులకు సాక్ష్యాలతో అందచేయటం, నరసింహం అరెస్ట్ కావటం జరుగుతుంది. భారత్- పాక్ యుద్ధ విరమణ అనంతరం.. రవి ప్రధానమంత్రి చేతులమీదుగా బహుమతి స్వీకరించి, తన ఊరిలో సుజాతను వివాహం చేసుకోగా.. రామూ, రఘు ఒకరేనని తెలియటంవంటి విశేషాలతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 జైజవాన్ |url=http://www.andhrabhoomi.net/content/flashback50-96 |accessdate=12 June 2020 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=15 February 2020 |archive-url=https://web.archive.org/web/20200225060729/http://www.andhrabhoomi.net/content/flashback50-96 |archive-date=25 ఫిబ్రవరి 2020 |url-status=live }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జై_జవాన్" నుండి వెలికితీశారు