అక్కా చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* దర్శకత్వం ఎ.సంజీవి
==పాత్రలు-పాత్రధారులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - జడ్జి రామచంద్రరావు/రాజా
* [[కృష్ణ]] - జడ్జి తమ్ముడు వేణు
* [[షావుకారు జానకి]] - అక్క జానకి
* [[విజయనిర్మల]] - చెల్లి లాయర్ విజయ
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] - ధర్మయ్య
* [[బి.పద్మనాభం]] - ధర్మయ్య కొడుకు భాను
* [[రమాప్రభ]] - అల్లు కూతురు సరోజ
* [[శాంతకుమారి]] - జడ్జి గారి తల్లి జయమ్మ
* [[విజయలలిత]] - ఆశ
* [[అల్లు రామలింగయ్య]] - స్టుడియో అధిపతి
* [[ప్రభాకర రెడ్డి]] - సీనియర్ లాయర్
* [[చిత్తూరు నాగయ్య]] - రెండవ జడ్జి
* [[ మాడా వెంకటేశ్వరరావు|మాడా]], నాగయ్య,
* [[రాజ‌బాబు]],
* [[సూర్యకాంతం (నటి)|సూర్యకాంతం]]
* వై.వి.రాజు
==కథ==
ఓ పట్టణంలో పేరున్న న్యాయమూర్తి రామచంద్రరావు. అతని తల్లి జయమ్మ , తమ్ముడు వేణు. వారి ఆప్తుడు, కోర్టులో గుమస్తా ధర్మయ్య, అతని కుమారుడు భాను. ఫొటోస్టూడియో అధినేత అల్లు రామలింగయ్య, కూతురు సరోజ. ఊళ్లో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయను పట్నంలో న్యాయవాద విద్య చదివించే అమాయకపు, నిజాయితీ యువతి జానకి. పట్నంలో చదువుతున్న వేణు, విజయ ప్రేమించుకుంటారు. జానకి, నిజాయితీ, మంచితనం నచ్చిన రామచంద్రరావు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అంతకుముందు ఓ స్రీని హత్య చేస్తున్న వ్యక్తిని విజయ అనుకోకుండా చూస్తుంది. తరువాత అక్కకు కాబోయే భర్త, తనకు కాబోయే బావే.. తానుచూసిన హంతకుడని గ్రహిస్తుంది. అక్క పెళ్లి జరిగాక, అతనిని కోర్టులో దోషిగా ఆరోపణ చేస్తుంది. అన్న తరపున వేణు లాయర్‌గా నిలబడతాడు. కేసును పరిశోధించి, తన అన్న రామచంద్రరావు హంతకుడు కాదని నిరూపిస్తాడు. తన అన్నతోపాటు జన్మించిన కవల సోదరుడు రాజా, తోటమాలి ఆ దారుణానికి పాల్పడ్డారని నిరూపిస్తాడు. అన్న నిర్దోషిగా విడుదలవ్వడంతో, వేణు -విజయల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అక్కా_చెల్లెలు" నుండి వెలికితీశారు