అవసరాల సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
ప్రధానంగా నాటక కర్త అయిన అతను నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశాడు. పంజరం [[ఆంధ్ర నాటక పరిషత్తు]] వారి బహుమానం పొందింది. ముల్క్ రాజ్ ఆనంద్ నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు<ref>{{Cite web|url=http://kathanilayam.com/writer/238|title=కథానిలయం - View Writer|website=kathanilayam.com|access-date=2020-06-14}}</ref> అవసరాల కథలు అతని రచనలు.
 
గురజాడను తెలుగువారికి బాగా పరిచయం చేసిన వ్యక్తిగా చెప్పుకోవలసింది శ్రీశ్రీ అయితే అతని రచనలను అందించిన వారిలో ప్రథముడు అవసరాల సూర్యారావు. అత్ను గురజాడ రాతప్రతులను అర్థం చేసుకుని, అనువదించిన వ్యక్తి. చాలా ఏళ్లపాటు అవన్నీ గురజాడ రాసినవే అనుకున్నారు కానీ అనువాదమన్న మాట మరచిపోయారు. ఆరోజులలో అవసరాల ఒక చేయి పనిచేయక, చాలా పేదరికంలో ఉంటూ కూడా అంకిత భావంతో ఈ యజ్ఞం నెరవేర్చాడు. గురజాడ ఏ పదం ఎలా వాడతాడో అవసరాలకు తెలిసినట్టు మరెవరికీ తెలియదని ఆరుద్ర అంతటి పరిశోధకుడే మెచ్చుకున్నాడు. ఇప్పుడు సంపుటాలకొద్దీ ముద్రించేందుకు ఆర్థిక వనరులు, సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి కానీ, ఆరోజుల్లో స్కానర్ల సహాయంతో ఇమేజి పెంచి చూసుకొనే సదుపాయాలు లేవు. కంప్యూటర్లు లేవు. అప్పట్లోనే అన్ని సంపుటాలు క్రమబద్ధంగా పూర్తిచేయడంలో సూర్యారావు నిబద్ధత తెలుస్తుంది.
 
దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో కొన్ని చోట్ల అనువాదాల తప్పులు దొర్లడం నిజమే కానీ భావానికి హాని కలిగించేవిగా లేవు. <ref>సాహిత్య ప్రస్థానం నవంబర్-డిసెంబర్ 2015 గురజాడ శతవర్థంతి ప్రత్యేక సంచిక</ref>
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/అవసరాల_సూర్యారావు" నుండి వెలికితీశారు