అనిల్ మల్నాడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. [[కర్ణాటక|కర్ణాటకలోని]] మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు.
 
సినిమాటోగ్రఫీ కోర్సు నేర్చుకుందామనే ఆలోచనతో చెన్నై చేరుకున్న అనిల్‌కు ఆ కోర్సులో సీటు దొరకకపోవడంతో దర్శకత్వ విభాగంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేశాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. దర్శకత్వ విభాగంతో పాటు ఎడిటింగ్‌పైనా శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాడు.<ref name=":1" /> అనిల్ పనితీరు నచ్చడంతో బాపు తన [[వంశవృక్షం (సినిమా)|వంశవృక్షం]] (1980) సినిమాతో ఎడిటర్‌గా పనిచేసేందుకు తొలి అవకాశం ఇచ్చాడు. ఆపై తెలుగు, తమిళ, ఒడియా, హిందీ వంటి 9 భాషల్లో 200 పైచిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాడు.<ref name=":0">{{Cite web|url=https://www.ap7am.com/flash-news-607528-telugu.html|title='సితార' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇక లేరు!..|website=ap7am.com|access-date=2020-06-14}}</ref> ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా పనిచేసిన అతికొద్దిమందిలో ఒకరిగా పేరొందాడు.<ref name=":1">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/editor-gr-anil-malnad-passes-away-1054959|title=సీనియర్‌ ఎడిటర్‌ అనిల్‌ మల్నాడ్‌ ఇకలేరు|date=2018-03-20|website=Sakshi|language=te|access-date=2020-06-14}}</ref> బాపు దర్శకత్వంలోనే 22 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత [[వంశీ]] సినిమా సితారతో ప్రారంభించి అతని సినిమాలకూ వరుసగా ఎడిటింగ్ చేయసాగాడు. [[గీతా కృష్ణ]], [[కె. రాఘవేంద్రరావు]] వంటి ఇతర దర్శకులకు కూడా పనిచేశాడు.<ref name=":1" />
 
1984లో [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/kinnerasani-lyrical-and-melodious-treat/article19784978.ece|title=Kinnerasani: Lyrical and melodious treat|last=Narasimham|first=M. L.|date=2017-10-02|work=The Hindu|access-date=2020-06-14|language=en-IN|issn=0971-751X}}</ref> పలు నంది అవార్డులూ అందుకున్నాడు. లేడీస్ టైలర్ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. సినిమా ఫ్లాప్‌ అయింది.<ref>{{Cite web|url=https://www.telugucinema.com/30-years-ladies-tailor|title=30 Years of Ladies Tailor|last=editor|first=tc|date=2016-12-03|website=telugucinema.com|language=en|access-date=2020-06-14}}</ref>
 
అనిల్ మల్నాడ్ తన కుటుంబంతో [[చెన్నై]]<nowiki/>లోని క్రోమ్‌పేటలో జీవించాడు. 2018 మార్చి 19న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/అనిల్_మల్నాడ్" నుండి వెలికితీశారు