కోవిడ్-19 వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి పారాగ్రాఫ్ అడ్జెస్ట్ చేసాను
పంక్తి 53:
ఇంకొక అంటుదారి ఉంది. రోగి తుమ్మూ చీమిడీ తుంపర్లు ఏ వస్తువు మీద పడ్డా విషాణువులు కొంత సేపు శిథిలమవకుండా ఉంటాయి. (చల్లని లోహపు వస్తువులమీద విషాణువులు కొన్ని రోజులు నిలవవచ్చు). ఈలోగా ఆ వస్తువుని ముట్టుకుని మొహము ముట్టుకున్నవారికి కోవిద్ రోగం అంటవచ్చు.
 
=== చికిత్స లేదు, నివారణ లేదు & వాక్సిన్, ఇంజక్షన్ లు కనుక్కునే ప్రయోగాలు ===
పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటివరకూ కోవిద్ రోగానికి చికిత్సగాని నివారణగాని దొరకలేదు. కాబట్టి రోగం అంటకుండా చూసుకోవాలి. రోగం సోకినట్లు కొన్ని రోజుల వరకూ రోగికే తెలియదు కాబట్టి ఇంటి బయట ఎవరైనా సరే రోగి అవచ్చు అనుకుని అందరికీ ఆరడుగుల దూరాన ఉండాలి. తరుచు చేతులు సబ్బూ నీళ్ళతో బాగా కడుగుకోవాలి, ముఖ్యముగా బయటనుండి రాగానే. అయినంతవరకు ముఖాన్ని ముట్టుకోకూడదు. ప్రత్యేకంగా కోవిద్ రోగులు ముక్కుకీ నోటికీ అడ్డంగా గుడ్ద కట్టుకోవాలి.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిద్ రోగవ్యాప్తి ఒక మహమ్మారి అనీ,, ఇది సార్వజనిక ఆరోగ్యానికి అత్యవసర పరిస్థితి అనీ ప్రకటించింది.
 
=== వాక్సిన్, ఇంజక్షన్ లు కనుక్కునే ప్రయోగాలు ===
భారత దేశము లోని  విశాఖపట్నం కు చెందిన ప్రముఖ వైద్యులు డా.వై.శ్రీహరి " కోవిడ్ ఇమ్మ్యూనోగ్లోబులైన్స్ ఇంజక్షన్" కనుక్కున్నారు . భారత ప్రభుత్వపు "ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్" వారు  ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు .అనేక వైద్యులు ఈ ఇంజక్షన్ కు మద్దతు గా పలు ప్రకటనలు చేశారు . ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే కోవిడ్ కు మందు కనిపెట్టిన మొదటి దేశం భారత దేశం అవుతుంది . ఈ ఇంజక్షన్ సక్సెస్ అయితే ఒక మూడు నెలల్లో పేషెంట్ లకు అందుబాటు లోకి రావచ్చు అని వైద్యులు చెపుతున్నారు .ఈ ఇంజక్షన్ భారత ప్రభుత్వపు పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ రిజిస్టర్ కాబడినది.వాక్సిన్ లు తయారు చెయ్యాలి అని ప్రపంచ వ్యాప్తము గా అనేక ప్రరిశోధనలు జరుగుతున్నాయి . కానీ ఇంకా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని శస్త్ర వేత్తలు చెపుతున్నారు .
 
"https://te.wikipedia.org/wiki/కోవిడ్-19_వ్యాధి" నుండి వెలికితీశారు