భువనచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''భువనచంద్ర''' ఒక ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత.
==జీవిత విశేషాలు==
భువనచంద్ర [[నూజివీడు]] దగ్గర [[గుళ్ళపూడి]] లో జన్మించారు.<ref>మే 3, 2009 [[ఈనాడు]] ఆదివారం సంచికలో ప్రచురితమైన భువన చంద్ర ఇంటర్వ్యూ ఆధారంగా</ref> ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత [[చింతలపూడి]] వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో [[చింతలపూడి]] గ్రంథాలయంలో [[చందమామ]] మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు. రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న [[ఆరుద్ర]], [[దాశరథి]], [[ఆత్రేయ]], [[శ్రీశ్రీ]] మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/భువనచంద్ర" నుండి వెలికితీశారు