భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 64:
 
1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన [[శుక్రాచార్యులు]]. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, [[విధాత]] అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు [[వేదశిరుఁడు]]. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది.
2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను [[స్నానము]] చేయుటకై నదికిపోయెను. అప్పుడు [[పులోముడు]] అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు [[గర్భము]] భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము [[చ్యవనుడు]] అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను.<ref>{{Cite web |url=http://www.andhrabharati.com/dictionary/# |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-12-16 |archive-url=https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/ |archive-date=2014-02-09 |url-status=dead }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు