ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 19:
 
==చరిత్ర==
[[నిజాం]] పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది. ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. [[అబీడ్స్, హైదరాబాదు|ఆబిడ్స్‌]] [[గన్‌ఫౌండ్రి (హైదరాబాదు)|గన్‌ఫౌండ్రి]] దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి.<ref name="ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర">{{cite web|last1=24తెలుగు|first1=ఎడ్యూకేషన్|title=ఉస్మానియా...వందేళ్ళ చరిత్ర|url=http://www.24telugu.com/view/Mjg2NQ|website=www.24telugu.com|publisher=రవీంద్రనాథ్‌ ఠాగూర్‌|accessdate=21 April 2018}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.
 
ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్‍లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని సంకల్పించి, [[తార్నాక]] ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు.