ఆనంద్ బక్షి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు ను తీసివేసారు; వర్గం:సినిమా పాటల రచయితలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 40:
ఇతని ప్రాథమిక విద్య అనంతరం ఇతడు భారతీయ సైన్యంలో చేరాడు. ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో ఇతనికి సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా ఇతడు కవిత్వం వ్రాసేవాడు. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించేవాడు. సైన్యంలో ఇతడు ఎక్కువ కాలం పనిచేశాడు.
==సినిమా రంగం==
ఇతడు హిందీ సినిమాలలో రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రవేశించాడు. కానీ చివరకు గేయ రచయితగా రాణించాడు. బ్రిజ్‌మోహన్ సినిమా ''భలా ఆద్మీ'' (1958) చిత్రంతో ఇతనికి గీతరచయితగా గుర్తింపు వచ్చింది. 1956 నుండి 1962 వరకు కొన్ని చిత్రాలకు పనిచేసినా 1962లో ''మెహెందీ లగీ మేరీ హాత్''తో ఇతని విజయ పరంపర ప్రారంభమయ్యింది. ఇతడు మొత్తం 638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాశాడు. ఇతని పాటలకు [[లక్ష్మీకాంత్ -ప్యారేలాల్]], [[ఆర్.డి.బర్మన్]], కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, [[ఎస్.డి.బర్మన్]], అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్-మిలింద్ మొదలైన సంగీత దర్శకులు బాణీలు కూర్చగా, షంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షీద్ బావ్రా, అమీర్‌బాయి కర్ణాటకి, సుధా మల్హోత్రా, కిషోర్[[కిశోర్ కుమార్]], శైలేంద్ర సింగ్, [[కుమార్ సానుసానూ]], కవితా కృష్ణమూర్తి వంటి అనేక మంది గాయనీ గాయకులు ఇతని పాటలను ఆలపించారు.
 
ఇతడు వ్రాసిన పాటలలో 1972లో వచ్చిన హరేరామ హరేకృష్ణ చిత్రంలోని ''దమ్‌ మారో దమ్'' పాట ఇతడిని ప్రతిభావంతుడైన రచయితగా నిలబెట్టింది. ఇతడు గీతరచన చేసిన చిత్రాలలో బాబీ, అమర్ ప్రేమ్‌, ఆరాధన, జీనే కీ రాహ్, మేరా గావ్ మేరా దేశ్, ఆయే దిన్ బహార్ కే, ఆయా సావన్ ఝూమ్‌కే, సీతా ఔర్ గీతా, షోలే, ధరమ్‌ వీర్, నగీనా, లమ్హే, హమ్‌, మొహ్రా, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, పర్‌దేశ్, దుష్మన్, తాళ్, మొహబ్బతే, గదర్:ఏక్ ప్రేమ్‌ కథ, యాదే వంటి అనేక విజయవంతమైన చిత్రాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఆనంద్_బక్షి" నుండి వెలికితీశారు