అబ్దుల్లా కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకసారి అబ్దుల్లా కుతుబ్ షాని ఎప్పటిలానే మొఘల్ రాజ ప్రతినిధిని తన కొలువులో ఉంచమని ఆదేశించగా, ఆ ఆదేశాన్ని అబ్దుల్లా తిరస్కరించాడు. ఖైదులో జీవిస్తున్నా షాజహాన్ జీవించే ఉండడంతో ఔరంగజేబు ధర్మబద్ధంగా చక్రవర్తి కాబోడనీ, ఇప్పటికీ షాజహానే చక్రవర్తి అనీ, కాబట్టి ఔరంగజేబు ఆదేశాలు తాను స్వీకరించనక్కరలేదనీ ఒక వాదన కూడా చెప్పాడు. మొఘల్ రాజప్రతినిధిని తన కొలువులో అవమానించాడు. దీనితో మొఘల్ సైన్యం మీదికి దండయాత్ర చేసి, అబ్దుల్లాను ఓడించింది. అలా కుదుర్చుకున్న సంధిలో కారణంగా అబ్దుల్లా మొఘల్ సామ్రాజ్యానికి లోబడి సామంతునిగా ఉండేట్టు అంగీకరించి గోల్కొండ రాజ్యానికి తిరిగి పాలకుడయ్యాడు.<ref name=":0" />
== పరిపాలన, సంస్కృతి ==
అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన చాలా ఇబ్బందుల్లో సాగింది. సైనికంగా చాలా బలహీనమైన పాలకుడిగా కనిపిస్తాడు. అయితే, సుల్తాన్ గా అతని బాధ్యతల్లో ఒకటైన న్యాయ నిర్ణయం విషయంలో అబ్దుల్లాకు చాలా మంచి పేరు ఉంది. న్యాయబుద్ధికి, న్యాయాన్యాయ విచక్షణకీ అతను పేరుపొందాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా అన్యాయంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేవాడు కాదు.{{sfn|Khamrunnisa Begum|1984|p=79}}[[దస్త్రం:Hayat_Bakshi_Mosque_01.jpg|thumb|అబ్దుల్లా తన తల్లి పేరిట నిర్మించిన [[హయాత్ బక్షీ మస్జిద్|హయాత్ బక్షీ మసీదు]]]]తెలుగు భాష పోషణ విషయంలో కుతుబ్ షాహీలు పేరు పొందినా [[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]] కాలంలో దీనికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అబ్దుల్లా తెలుగు భాషా సాహిత్యాల పోషణను పునరుద్ధరించాడు.{{sfn|Khamrunnisa Begum|1984|p=215}} మత సామరస్యాన్ని కూడా పాటించాడు, హిందూ ముస్లింలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తన చర్యలతో దోహదం చేశాడు.{{sfn|Khamrunnisa Begum|1984|p=217}} అబ్దుల్లా కాలంలో గోల్కొండ రాజ్యంలో ద్విభాషా ఫర్మానాలు వెలువడ్డాయి, వీటిలో పర్షియన్ భాషలో సారాంశం, తెలుగులో పూర్తి పాఠం ఉండేవి.{{sfn|Khamrunnisa Begum|1984|p=221}} అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ రాజ్యంలో మల్లారెడ్డి దేశాయ్, కేశన-మల్లన వంటి తెలుగు కవులు కావ్యాలు రాశారు.{{sfn|Khamrunnisa Begum|1984|p=230}} అబ్దుల్లా కాలంలోనూ గోల్కొండ రాజ్యంలో పర్షియన్ సాహిత్య పోషణ ఎంతగానో జరిగింది. అతని పాలనలో ఇక్కడ అనేకానేక పర్షియన్ రచనలు వచ్చాయి. 1651లో అబ్దుల్లా పాలనలో మహమ్మద్ హుసేన్ బుర్హాన్ రూపొందించిన బుర్హాన్-ఇ-ఖాతీ అన్న పర్షియన్ నిఘంటువు ఈనాటికీ పర్షియన్ భాషలో ప్రామాణికమైన నిఘంటువుగా పేరొందింది. మరెన్నో పర్షియన్ రచనలు, చెప్పుకోదగ్గ ఉర్దూ సాహిత్యం అబ్దుల్లా పోషణలో వెలువడింది.{{sfn|Khamrunnisa Begum|1984|p=244}}
 
తెలుగు భాష పోషణ విషయంలో కుతుబ్ షాహీలు పేరు పొందినా [[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]] కాలంలో దీనికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అబ్దుల్లా తెలుగు భాషా సాహిత్యాల పోషణను పునరుద్ధరించాడు.{{sfn|Khamrunnisa Begum|1984|p=215}} మత సామరస్యాన్ని కూడా పాటించాడు, హిందూ ముస్లింలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తన చర్యలతో దోహదం చేశాడు.{{sfn|Khamrunnisa Begum|1984|p=217}} అబ్దుల్లా కాలంలో గోల్కొండ రాజ్యంలో ద్విభాషా ఫర్మానాలు వెలువడ్డాయి, వీటిలో పర్షియన్ భాషలో సారాంశం, తెలుగులో పూర్తి పాఠం ఉండేవి.{{sfn|Khamrunnisa Begum|1984|p=221}} అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ రాజ్యంలో మల్లారెడ్డి దేశాయ్, కేశన-మల్లన వంటి తెలుగు కవులు కావ్యాలు రాశారు.{{sfn|Khamrunnisa Begum|1984|p=230}} అబ్దుల్లా కాలంలోనూ గోల్కొండ రాజ్యంలో పర్షియన్ సాహిత్య పోషణ ఎంతగానో జరిగింది. అతని పాలనలో ఇక్కడ అనేకానేక పర్షియన్ రచనలు వచ్చాయి. 1651లో అబ్దుల్లా పాలనలో మహమ్మద్ హుసేన్ బుర్హాన్ రూపొందించిన బుర్హాన్-ఇ-ఖాతీ అన్న పర్షియన్ నిఘంటువు ఈనాటికీ పర్షియన్ భాషలో ప్రామాణికమైన నిఘంటువుగా పేరొందింది. మరెన్నో పర్షియన్ రచనలు, చెప్పుకోదగ్గ ఉర్దూ సాహిత్యం అబ్దుల్లా పోషణలో వెలువడింది.{{sfn|Khamrunnisa Begum|1984|p=244}}
[[దస్త్రం:Hayat_Bakshi_Mosque_01.jpg|thumb|అబ్దుల్లా తన తల్లి పేరిట నిర్మించిన [[హయాత్ బక్షీ మస్జిద్|హయాత్ బక్షీ మసీదు]]]]
రెండవ మీర్ జుమ్లా చేతిలో మోసపోయి అనేక సమస్యల పాలైన కారణంగా చివరి దశలో తనకు నమ్మకస్తులైన వారిని పరిపాలనలో నియమించుకోవాలని అబ్దుల్లా నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే ప్రతిభావంతుడైన తెలుగు బ్రాహ్మణ ఉద్యోగి [[మాదన్న]]<nowiki/>ను ప్రోత్సహించాడు. రాజ్యంలోని అన్ని కీలకమైన ఉద్యోగాల్లోనూ మాదన్నకు నమ్మకస్తులైన వ్యక్తులను నియమించమని అతనికి అవకాశం కల్పించాడు. క్రమేపీ అతన్ని బలపరుస్తూ వచ్చి, తుదకు సయ్యద్ ముజఫర్‌ను తొలగించి, మీర్ జుమ్లా (ఆర్థిక మంత్రి) పదవిలో మాదన్నను నియమించాడు. మాదన్న సైన్యంలోనూ, పరిపాలనలోనూ వివిధ ఉన్నత పదవుల్లో తనకు నమ్మకస్తులైన దగ్గరి బంధువులను, కుటుంబ సభ్యులను నియమించాడు.{{sfn|Khamrunnisa Begum|1984|p=35}}