వి. వి. వినాయక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
2002లో [[జూనియర్ ఎన్.టి.ఆర్]] హీరోగా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/interview-v-v-vinayak-i-want-to-give-pawan-kalyan-a-bubbly-characterization.html|title=Interview : V.V.Vinayak – I want to give Pawan Kalyan a bubbly characterization - 123telugu.com|work=123telugu.com}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/ntr-is-interested-in-adhurs-2-v-v-vinayak.html|title=Chitchat with V.V.Vinayak : NTR is interested in Adhurs 2 - 123telugu.com|work=123telugu.com}}</ref> వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రం తమిళంలో ''జై'' పేరుతో రిమేక్ చేయబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/140708/entertainment-tollywood/article/v-v-vinayak-picks-debutant|title=V V Vinayak picks debutant|work=Deccan Chronicle}}</ref> 2003లో [[దిల్]], [[చిరంజీవి]] నటించిన [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] వంటి అనే రెండు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. [[దుబాయ్‌]]లో జరిగిన 2006 ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శించబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/150719/entertainment-tollywood/article/rs-100-crore-budget-film-pipeline|title=A Rs 100-crore budget film in pipeline?|work=Deccan Chronicle}}</ref> 2013లో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/short-film-to-promote-organ-donation/article4559077.ece|title=Short film to promote organ donation|author=Staff Reporter|work=The Hindu}}</ref>
 
చిరంజీవి, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[అల్లు అర్జున్]], జూనియర్ ఎన్టీఆర్, [[నితిన్]], [[ప్రభాస్]] వంటి నటులకు విజయవంతమైన సినిమాలు అందించాడు. ''దిల్'' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాత దిల్ రాజును పరిచయం చేసాడు. 2006లో వచ్చిన చిత్రం ''లక్ష్మి'' సినిమా వెంకటేష్‌కు మాస్ హీరోగా మళ్ళీ గుర్తింపును ఇవ్వడమేకాకుండా, వెంకీ కెరీర్‌లో హిట్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2007లో ప్రభాస్ హీరోగా వచ్చిన ''యోగి'' చిత్రం పరాజయంకాగా, 2008లో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా వచ్చిన ''కృష్ణ'' సినిమా విజయం సాధించగా, ఈ సినిమాతో వినాయక్ రొమాంటిక్ కామెడీ దర్శకుడిగా గుర్తింపు పొందాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వి._వి._వినాయక్" నుండి వెలికితీశారు