భాగ్యదేవత: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
playback_singer = సత్యం |
}}
సారథి స్టూడియో బ్యానర్‌పై యార్లగడ్డ రామకృష్ణప్రసాద్ నిర్మించిన '''భాగ్యదేవత'''[[1959]] [[అక్టోబర్ 23]]వ తేదీన విడుదలైంది.
 
==సాంకేతికవర్గం==
* కథ, సంభాషణలు: [[తాపీ ధర్మారావు]]
* సంగీతం: [[మాస్టర్ వేణు]]
* నృత్యం: వి.జె.శర్మ
* కళ: వి.సూరన్న
* ఛాయాగ్రహణం: యూసఫ్ ముఖర్జీ
* ఎడిటింగ్: ఎ.సంజీవ్
* అసోసియేట్ దర్శకులు: జి కబీర్‌దాస్
* ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
* దర్శకత్వం: [[తాపీ చాణక్య]]
* నిర్మాత: వై.రామకృష్ణప్రసాద్
==నటవర్గం==
* [[కొంగర జగ్గయ్య]] - గిరి
* [[సావిత్రి]] - సరళ
* [[రేలంగి వెంకట్రామయ్య]] - గోపాలం
* [[నిర్మలమ్మ]] జడ్జి భార్య
* [[రాజసులోచన]] - లలిత
* [[సూర్యకాంతం]]
* [[మన్నవ బాలయ్య|బాలయ్య]] - మూర్తి
* పెరుమాళ్లు - తాసీల్దారు
 
==కథ==
కీర్తిశేషుడైన జడ్జి భార్య నిర్మలమ్మ. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలిత, చిన్న కుమార్తె సరళ. లలితకు తన మిత్రుడైన తాసీల్దారు కుమారుడు గిరితో పెళ్లి జరిపించమన్న భర్త కోరికమేరకు -లలిత గిరిల పెళ్లి నిశ్చయిస్తుంది నిర్మలమ్మ. మెడిసన్ చదివిన లలిత ఆ పెళ్లిని వ్యతిరేకించి, తాను ప్రేమించిన మూర్తి వద్దకెళ్లి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి కోరిక, కుటుంబం పరువూ నిలపాలని ఆలోచించిన చిన్న కుమార్తె సరళ -తల్లిని, పెళ్లివారిని, గిరిని ఒప్పించి అదే ముహూర్తానికి గిరిని పెళ్లి చేసుకుంటుంది. లలిత -మూర్తి ఆనందంగా జీవిస్తుంటారు. తనను నిరాకరించి అవమానించిందని లలితపై కోపం పెంచుకున్న గిరి -ఆమె ఇంటికి తరచూ వస్తూ చనువు ప్రదర్శించి... భర్త మూర్తిలో అనుమానం రేకెత్తిస్తాడు. లలితను అనుమానించిన మూర్తి ఆమెను మాటలతో హింసించగా, ఇల్లు వదిలిన లలిత.. కంపౌండర్ గోపాలం సాయంతో మగవేషంలో డాక్టరుగా మూర్తివద్దే పనిచేస్తూ తన విషయం చెల్లెలు సరళకు చెప్పుకుంటుంది. దీనికి తన భర్త కారణమని గ్రహించిన సరళ -లలిత కాపురం సరిదిద్దమని భర్తను వేడుకుంటుంది. గిరి తిరస్కరిస్తాడు. ఈలోగా గిరి చేతిలో తుపాకీ పేలి ఒక వ్యక్తి గాయపడతాడు. అయితే గిరి నేరాన్ని సరళ తనమీద వేసుకుని జైలుకెళ్లటంతో గిరిలో మార్పు వస్తుంది. మూర్తివద్దకు బయలుదేరుతూ దారిలో యాక్సిడెంట్‌కు గురవుతాడు. హాస్పిటల్‌లో గిరికి వైద్యం చేయటానికి మూర్తి నిరాకరించటంతో, లలిత అతన్ని కాపాడుతుంది. జామీనుమీద వచ్చిన సరళ అందరికీ నిజం చెప్పటం, అప్పటికే మరోసారి భర్త తిరస్కారానికి గురై లలిత ఆత్మహత్యకు యత్నించటం, స్పృహలోకి వచ్చిన గిరి.. మూర్తిని క్షమాపణకోరి నిజం వెల్లడించటంతో మూర్తిలో మార్పు వస్తుంది. రైలు క్రింద పడబోయిన లలితను -మూర్తి, సరళ అంతాకలిసి కాపాడటం.. ఈ సంసార కథ ఈవిధంగా సుఖంగా నడవడానికి కారణం సరళ మంచితనం, లక్షణాలు అంటూ ఆమె తమపాలిటి ‘భాగ్యదేవత’ అని అందరూ ప్రశంసించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
==పాటలు==
# ఉంటే చాలునా అంటే ఆగునా
# మరికొంచెం నిద్దుర కానీ
==విశేషాలు==
 
* ఈ సినిమా హైదరాబాదులోని సారథీ స్టూడియోలో నిర్మించబడిన రెండవ సినిమా.
* తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను జెమిని గణేశన్, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, నంబియార్ ముఖ్య పాత్రధారులుగా 'భాగ్యదేవతై' అనే పేరుతో నిర్మించారు. తమిళ వర్షన్ కూడా పూర్తిగా హైదరాబాదులో తయారయ్యింది. ఒక తమిళ సినిమా పూర్తిగా ఆంధ్రదేశంలో నిర్మించడం అదే మొదటి సారి. తమిళ సినిమా 1959 జూన్ 12న విడుదలయ్యింది.
* సినిమాలో బాలయ్య, రాజసులోచన ఉన్న బస్సులో ఓ ప్రయాణికునిగా తమిళ హీరో జెమిని గణేశన్ కనిపిస్తాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటిలింకులు==
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:సావిత్రి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/భాగ్యదేవత" నుండి వెలికితీశారు