భాగ్యదేవత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
* [[మన్నవ బాలయ్య|బాలయ్య]] - మూర్తి
* పెరుమాళ్లు - తాసీల్దారు
* [[రావి కొండలరావు]]
* ఎ.కె.రావు
* సీతారాం,
* కె.వెంకట్రామయ్య
* లక్ష్మీమాధురి
* వాణి
* సుశీల
 
==కథ==
కీర్తిశేషుడైన జడ్జి భార్య నిర్మలమ్మ. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలిత, చిన్న కుమార్తె సరళ. లలితకు తన మిత్రుడైన తాసీల్దారు కుమారుడు గిరితో పెళ్లి జరిపించమన్న భర్త కోరికమేరకు -లలిత గిరిల పెళ్లి నిశ్చయిస్తుంది నిర్మలమ్మ. మెడిసన్ చదివిన లలిత ఆ పెళ్లిని వ్యతిరేకించి, తాను ప్రేమించిన మూర్తి వద్దకెళ్లి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకుంటుంది. తండ్రి కోరిక, కుటుంబం పరువూ నిలపాలని ఆలోచించిన చిన్న కుమార్తె సరళ -తల్లిని, పెళ్లివారిని, గిరిని ఒప్పించి అదే ముహూర్తానికి గిరిని పెళ్లి చేసుకుంటుంది. లలిత -మూర్తి ఆనందంగా జీవిస్తుంటారు. తనను నిరాకరించి అవమానించిందని లలితపై కోపం పెంచుకున్న గిరి -ఆమె ఇంటికి తరచూ వస్తూ చనువు ప్రదర్శించి... భర్త మూర్తిలో అనుమానం రేకెత్తిస్తాడు. లలితను అనుమానించిన మూర్తి ఆమెను మాటలతో హింసించగా, ఇల్లు వదిలిన లలిత.. కంపౌండర్ గోపాలం సాయంతో మగవేషంలో డాక్టరుగా మూర్తివద్దే పనిచేస్తూ తన విషయం చెల్లెలు సరళకు చెప్పుకుంటుంది. దీనికి తన భర్త కారణమని గ్రహించిన సరళ -లలిత కాపురం సరిదిద్దమని భర్తను వేడుకుంటుంది. గిరి తిరస్కరిస్తాడు. ఈలోగా గిరి చేతిలో తుపాకీ పేలి ఒక వ్యక్తి గాయపడతాడు. అయితే గిరి నేరాన్ని సరళ తనమీద వేసుకుని జైలుకెళ్లటంతో గిరిలో మార్పు వస్తుంది. మూర్తివద్దకు బయలుదేరుతూ దారిలో యాక్సిడెంట్‌కు గురవుతాడు. హాస్పిటల్‌లో గిరికి వైద్యం చేయటానికి మూర్తి నిరాకరించటంతో, లలిత అతన్ని కాపాడుతుంది. జామీనుమీద వచ్చిన సరళ అందరికీ నిజం చెప్పటం, అప్పటికే మరోసారి భర్త తిరస్కారానికి గురై లలిత ఆత్మహత్యకు యత్నించటం, స్పృహలోకి వచ్చిన గిరి.. మూర్తిని క్షమాపణకోరి నిజం వెల్లడించటంతో మూర్తిలో మార్పు వస్తుంది. రైలు క్రింద పడబోయిన లలితను -మూర్తి, సరళ అంతాకలిసి కాపాడటం.. ఈ సంసార కథ ఈవిధంగా సుఖంగా నడవడానికి కారణం సరళ మంచితనం, లక్షణాలు అంటూ ఆమె తమపాలిటి ‘భాగ్యదేవత’ అని అందరూ ప్రశంసించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/భాగ్యదేవత" నుండి వెలికితీశారు