ఫిట్టింగ్ మాస్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film
{{సినిమా
|name = ఫిటింగ్ మాస్టర్
|year = 2009
పంక్తి 11:
|producer =
|distributor =
|released = {{Film date|14 జనవరి |01|2009}}
|runtime =
|language = తెలుగు
పంక్తి 24:
|imdb_id =1606217
}}
'''ఫిట్టింగ్ మాస్టర్''' ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 2009 లో విడుదలైన చిత్రం. ఇందులో అల్లరి నరేష్, మదాలస శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. జనవరి 14, 2009 లో విడుదలైన చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.<ref>{{cite web|url=http://movies.buzzintown.com/fitting-master/segment--synopsis/id--74309.html|title=Fitting Master story plot, photos, trailer, release date, latest news - Buzzintown|website=Movies.buzzintown.com|accessdate=2016-01-21}}</ref> బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.<ref name="way2movies.com">{{cite web|url=http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Hits-and-Flops-of-2009-11-3864.html|title=Hits and Flops of 2009|website=Teluga.way2movies.com|accessdate=2016-01-21}}</ref>
 
== కథ ==
{{మొలక-తెలుగు సినిమా}}
సంపత్ అలియాస్ ఫిటింగ్ మాస్టర్ ఒక వ్యాయామ శిక్షకుడు. సంపత్ ఒకసారి మేఘన అనే ఒక అమ్మాయిని ఒక ప్రమాదం నుండి రక్షిస్తాడు. మేఘన అతనితో ప్రేమలో పడుతుంది కానీ సంపత్ మాత్రం తను ఆమెను పెళ్ళి చేసుకోలేననీ, చేసుకున్నా సంతోషంగా ఉంచలేనని చెప్పి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. ఆమె సంపత్ ను పెళ్ళికి ఒప్పించడానికి దుబాయ్ లో ఉన్న తన అన్నకు ఫోన్ చేసి రమ్మంటుంది. కానీ అతను వచ్చేదారిలో హత్యకు గురవుతాడు. ఒక పోలీస్ అధికారి ఈ కేసును విచారిస్తుంటాడు. తర్వాత ఆమె సంపత్ తన సోదరుని హత మార్చాడని అనుమానిస్తుంది. అది నిజమేనని సంపత్ నిర్ధారించి తన అన్న నిజ స్వరూపాన్ని ఆమెకి తెలియజేస్తాడు. మేఘన అన్న, అతని స్నేహితులు మరో ఇద్దరు కలిసి సంపత్ చెల్లెలి వ్యక్తిగత వీడియోలని ఇంటర్నెట్ లో పెడతారు. అంతకు ముందే ఈ ముగ్గుర్లో ఒకడు సంపత్ చెల్లెల్ని ప్రేమించి లేచిపోయి పెళ్ళిచేసుకుని ఉంటాడు. సంపత్ తల్లి గుండెపోటుతో మరణిస్తుంది. కొన్ని రోజుల తర్వాత సంపత్ చెల్లెలి భర్త స్నేహితులు ఆమె మొదటి రాత్రి వీడియోలని చూపించి ఆమెను మానభంగం చేస్తారు. ఆమె భర్తకు చెప్పగా అతను తేలిగ్గా తీసుకుంటాడు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇవన్నీ చూసిన సంపత్ తన కుటుంబం నాశనం చేసినవారిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందుకే పథకం ప్రకారం మేఘనను ప్రేమించినట్లు నటించి ఆమె అన్నను దుబాయ్ నుంచి రప్పించి చంపేస్తాడు.మిగతా ఇద్దరు స్నేహితులను కూడా అలాగే చంపేస్తాడు సంపత్. మేఘన మాత్రం అతన్ని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ సంపత్ మాత్రం కొడుకుని చంపిన హంతకుని ఎవరూ అల్లునిగా అంగీకరించరనీ, తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోమని చెప్పి బయటకు వచ్చేస్తాడు.
 
== తారాగణం ==
* సంపత్ గా [[అల్లరి నరేష్]]
* మేఘనగా [[మదాలస శర్మ]]
* సంపత్ తండ్రిగా [[చంద్రమోహన్]]
* సంపత్ తల్లిగా [[సుధ (నటి)|సుధ]]
* పోలీసు అధికారిగా [[సాయాజీ షిండే|శాయాజీ షిండే]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[అమిత్ తివారి|అమిత్ తివారీ]]
* [[రావు రమేశ్|రావు రమేష్]]
* [[శ్రీనివాస రెడ్డి]]
* [[ఖయ్యూమ్]]
* [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతి రావు]]
* [[జయప్రకాశ్ రెడ్డి]]
* [[సురేఖా వాణి|సురేఖ వాణి]]
* [[కృష్ణ భగవాన్|కృష్ణభగవాన్]]
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* [[సైరాభాను]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఫిట్టింగ్_మాస్టర్" నుండి వెలికితీశారు