శ్రీకృష్ణ మాయ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 62:
శాంతి మంత్రం ఋషులు పఠిస్తుండగా ఇంద్రసభ ప్రారంభం అవుతుంది. ఇంద్రుడు (రాజనాల) దేవ పారిజాత వృక్షాన్ని, శ్రీకృష్ణ తులాభారం ద్వారా తమకు దక్కించినందుకు నారద మహర్షి (అక్కినేని)కి కృతజ్ఞతలు తెలియచేయగా నారదుడు, ఆ పొగడ్తలకు గర్వోన్నతుడై త్రిమూర్తులను హేళనచేస్తాడు. తాను మాయాతీతుడని ప్రకటిస్తాడు.
 
ద్వారకలో సత్యభామతో చదరంగమాడుతున్న శ్రీకృష్ణుడు (ఈలపాట రఘురామయ్య) నారదునికి జ్ఞానం కలిగించాలని, ఋషి దంపతులుగా ఓ ఆశ్రమం చేరి, అతనిలోని జ్ఞానాన్ని గ్రహించి, నారదుని ఓ నదిలో మునగమంటాడు. ఒడ్డున వున్న శ్రీకృష్ణుడు నారద వీణ మహతిని మాయ (జమున) అనే కోయ యువతిగా మార్చగా ఆమెతో, నది నుండి బయటకువచ్చిన నారదుడు ప్రేమ, పెళ్ళి, సంసారం సాగించటం, బహుసంతానంతో, లేమితో పలు అవస్థలకు లోనుకావటం, నారదుడన్న భావన, సంసారం తాపత్రయాలు భరించి, చివరకు శ్రీకృష్ణునిచే తిరిగి జ్ఞానాన్ని పొంది, పశ్చాత్తాపంతో వానిని శరణువేడడంతో చిత్రం ముగుస్తుంది. సృష్టిలోని సకల చరాచర జీవులు, ఆ జగన్మాత మహత్తర శక్తికి లోనయి నడువవలసిందేనని, తామే సర్వశక్తివంతులని విర్రవీగితే గర్వభంగం తప్పదన్న నీతితో రూపొందిన చిత్రం ‘శ్రీకృష్ణమాయ’<ref>[{{Cite web |url=http://www.andhrabhoomi.net/content/flashback50-9 |title=శ్రీకృష్ణమాయ -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 02-06-2018] |website= |access-date=2018-10-27 |archive-url=https://web.archive.org/web/20180814162545/http://www.andhrabhoomi.net/content/flashback50-9 |archive-date=2018-08-14 |url-status=dead }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_మాయ" నుండి వెలికితీశారు