కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కూనలమ్మ పదాలు - ఆరుద్ర

"కూనలమ్మ" వ్యాసం నుండి విషయాన్ని ఇక్కడికి మార్చాను.
పంక్తి 1:
'''ఓ కూనలమ్మా'''' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన [[కూనలమ్మ పదాలు]] అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు [[ఆరుద్ర]].

[[కూనలమ్మ|కూనలమ్మ పదాలు]] - ఆరుద్ర

ఆరుద్ర ఈ పద్యాల్ని [[ముళ్ళపూడి వెంకటరమణ]]కు జనవరి 26, 1964న పెళ్ళికానుకగా ఇచ్చాడు

మహాకవి [[శ్రీశ్రీ]] మాటల్లో కూనలమ్మ పదాల ఆరుద్ర గురించి.

[[కూనలమ్మ|కూనలమ్మ పదాలు]] - ఆరుద్ర

వేనవేలు పదాలు

ఆరుద్రదే వ్రాలు

అంటాడు శ్రీ శ్రీ

కూనలమ్మ పదాలు

లోకానికి సవాలు

ఆరుద్రదే వ్రాలు

అంటాడు శ్రీ శ్రీ

కూనలమ్మ పదాలు

కోరుకున్న వరాలు

ఆరుద్ర సరదాలు

అంటాడు శ్రీ శ్రీ

'''కొన్ని కూనలమ్మ పదాలు:'''

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంత్రుప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రదమ్ము

ఓ కూనలమ్మ

అరుణబింబము రీతి

అమర నెహ్రు నీతి

ఆరిపోవని జ్యోతి

ఓ కూనలమ్మ

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ

'''[[శ్రీశ్రీ]] గురించి''' -

రెండు శ్రీల ధరించి

రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ

'''[[కృష్ణశాస్త్రి]] గురించి''' -

కొంతమందిది నవత

కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ

[[వర్గం:తెలుగు సాహిత్యం]]
[[వర్గం: తెలుగు రచనలు]]
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు