"మాఘ" కూర్పుల మధ్య తేడాలు

3,879 bytes added ,  10 నెలల క్రితం
చి (వర్గం:హిందూ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగు: 2017 source edit
 
==జీవిత సంగ్రహం==
మనకి తెలిసినంతవరకు మూఘుని యశస్సుకి ఏకైక కారణం శిశుపాల వధ. [[వల్లభదేవుడు]], [[క్షేమేంద్రుడు]] మాఘుని రచనలు అంటూ కొన్ని శ్లోకాలని ఉదహరించేరు కాని అవి "శిశుపాల వధ"లో కానరావు. కాబట్టి మాఘుడి రచనలు ఇంకా ఉన్నాయని, అవి అలభ్యం అనీ కొందరి నమ్మకం.
 
 
కాళిదాస రచనలలోని ఉపమానాలంకారం, భారవి కిరాతార్జునీయంలోని అర్ధ గౌరవం, దండి దశకుమార చరిత్ర, అవంతి సుందరీ కధలలోని పదలాలిత్యమూ ఈ మూడు మాఘుని శిశుపాల వధలో ఉన్నదని పలువురు విమర్శకుల యోగ్యతా పత్రాలు మాఘునికి లభించాయి.వివిధ కవితా ప్రయోగాలు చేయడంతో పాటు పెక్కు శాస్త్రాల రహస్యాలు సందర్భానుసారంగా జోడించాడు.జ్యోతిశాస్త్ర పరిచయం కూడా మాఘునుకి బాగా ఉన్నదని అతని కావ్యం వలన స్పష్టం అవుతున్నది. ఉదాహరణకు: శిశుపాలుని దుండగాలు మితిమీరాయి.వానిని శిక్షించటం అవసరం. ధర్మరాజు రాజసూయయాగం చేయదలచి పార్దునితో సందేశం పంపాడు.రెండు పనులూ ముఖ్యం. కనుక ఉద్దన బలరాములతో ఆలోచిస్తాడు కృష్ణుడు; ఈ ఆలోచనలకోసం ఆలోచన మందిరానికి వాళ్ళవెంట వెళ్ళుతాడు. ఈ కార్యం సఫలం అవుతుందని సూచించడం కవి ఉద్దేశం. కనుక గురు శుక్రులతో కలిసిన చంద్రుడిలాగా ఉన్నాడు కృష్ణుడు అని వర్ణిస్తాడు.మూడు శుభ గ్రహాలు జ్యోతిశ్శాస్త్ర రీత్యం శుభకరం. అలానే మరియోక చోట: కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళుతాడు రాజసూయ యాగం కోసం. అర్జునుడు సవినయంగా దారి చూపగా, భీముడు వెంట నడువగా కృష్ణుడు ఇంద్రప్రస్థం చేరునపుడు రెండు గ్రహాల మధ్య ఉన్న చంద్రుడిలాగా దురధరాయోగం కలిగించాడట.మాఘుడు తన కావ్యంలో సూర్యచంద్ర గ్రహాలను గురుంచి చాలాచోట్ల ప్రస్తావించాడు.శిశుపాలుడు ప్రయోగించిన నాగస్త్రం వలన జనించిన పాముల పూత్కారధూమానికి సూర్యబింబం కాంతి మంగగించిన మేడుపండ్ల గుత్తిలాగ వుందట-అంటే రాహుగ్రస్త గ్రహణంలాగా.ఈవిధంగా మాఘకవి జ్యోతిశ్శాస్త్ర ప్రతిభకు చాలా ఉదాహరణలు మాఘుని కావ్యాలలో కనిపిస్తాయి.పంజాబ్ విశ్వవిద్యాలయాచార్యుడు శశిధరశర్మ వాచస్పతి జ్యోతిష్మతి పత్రికలో మాఘుని కొన్ని జ్యోతిశ్శాస్త్ర విషయాలను తెలిపారు.
 
==కొన్ని ఛెణుకులు==
710

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2970471" నుండి వెలికితీశారు