తులసి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
* తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
*చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, [[డయేరియా]], [[వాంతులు]] వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
* ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, [[మిరియాలు]], [[ధనియాలు]] కలిపి నూరి తింటే వాంతులు, [[దగ్గు]] నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
* ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - [[కీటకాలు|కీటకాలను]] దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, [[హెర్బల్ టీ]], నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక cox-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న ''యూజినాల్' (Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).<ref>Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.</ref><ref>Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.</ref> ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక [[డయాబెటిస్]] ([[చక్కెర వ్యాధి]]) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.<ref>Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118</ref>
*రక్తంలో [[కోలెస్టరాల్]]ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.<ref>Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.</ref>
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు