అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
'''అమరావతి కథలు''' [[సత్యం శంకరమంచి]] రచించిన [[తెలుగు]] కథాసంపుటి . [[అమరావతి (గ్రామం)|అమరావతి]] గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో సుమారు రెండు [[సంవత్సరాలు]] 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి. ఏ కథా కూడా ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో [[ముద్రణ]] కాయితం కరువు ఉండేది. ఆ కారణాన, [[ఆంధ్రజ్యోతి]] పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే [[చందమామ]] మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడా రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడా ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత [[సత్యం శంకరమంచి]] అభినందనీయులు. శంకరమంచి సత్యంచక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసాడు .
 
ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు [[శ్యామ్ బెనగళ్]] ఈ కథలను [[హిందీ భాష|హిందీ]]లో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక 1994-1995 లో జాతీయ [[దూరదర్శన్]] నెట్వర్క్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక [[అమరావతి]]లోనే చిత్రీకరించబడటం విశేషం. తెలుగులో తరంగ సుబ్రమణ్యం తరంగ ఫిల్మ్స్ బేనర్ పై ధారావాహికగా చిత్రీకరించాడు. ఇది రాష్ట్ర దూరదర్శన్ లో ప్రసారమైంది.
 
==రచనా నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు