మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
గ్రంధలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం [[గ్రంధాలయము]]ను యేర్పాటు చేశారు. [[దంత]] కళాశాల, [[కన్ను|నేత్ర]] కళాశాల కూడాస్థాపించారు.
నిజానికి సాహిత్యరంగంలో కంటె సాంఘికరంగంలోనే రామచంద్రశాస్త్రిగారి కృషి ఎక్కువగా కనబడుతుంది. అనర్గళంగా ఉపన్యసించే శక్తి ఆయనకు ఉండేదని, మైకులులేని ఆరోజులలో (అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాకముందు, 1910-20 ప్రాంతాల్లో) వేలాదిమంది జనాన్ని తమ ఉపన్యాసంతో ఆకట్టుకోగలిగేవారనీ, జాతీయోద్యమంలో గాంధీగారి అనుచరులై ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారనీ వారిని గురించి పెద్దలు వ్రాసిన వ్రాతల వలన తెలుస్తుంది.
సాంఘికంగా వీరేశలింగంగారితో మొదలైన సంస్కరణధోరణిని అందిపుచ్చుకుని విశాఖపట్టణంలో తమ వంతు సేవగా పాఠశాలలను స్థాపించడం, బాల బాలికలకు విద్యను ప్రోత్సహించడం వంటి
కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా కొనసాగించారు.
 
== తెలుగు భాషా సేవ ==
గ్రాంథికవాదే అయినప్పటికీ, అచ్చతెలుగు మీద ఆయనకు మమకారం చాల హెచ్చు. ఈ మమకారం అచ్చతెలుగులో ఒక నిఘంటువును రూపొందించే దాకా వెళ్ళింది. కాని, ఆ నిఘంటు నిర్మాణం పూర్తయినట్లుగా కనపడదు. విశాఖపట్టణంలో శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామి, ఇత్యాదులు కలిసి ఏర్పరచిన ‘కవితా సమితి’ అనే సాహితీ సంస్థకు కవిగారు అద్యక్షులుగా ఉండేవారు.